Bigg Boss 6 Telugu: Faima Remuneration for 13 Weeks Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆసక్తిగా ఫైమా రెమ్యునరేషన్‌.. 13 వారాలకు ఆమెకు ఎంత ముట్టిందంటే!

Published Mon, Dec 5 2022 12:41 PM | Last Updated on Mon, Dec 5 2022 1:07 PM

Bigg Boss 6 Telugu: Faima Total Remunaration For 13 Weeks Goes Viral - Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఫైమా హౌజ్‌ను వీడింది.  ఫన్‌ అండ్‌ గేమ్‌ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్‌ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో కాస్తా సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. 13వ వారం మొదటి నుంచి కీర్తి ఎలిమినేట్‌ అవుతుందనే అభిప్రాయలు వ్యక్తం అవగా అనూహ్యంగా ఫైమా బిగ్‌బాస్‌ను వీడింది. ఇది ఆమె ఫాలోవర్స్‌ షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. అయితే ఆమె చేసిన కొన్ని పొరపాటు వల్ల నెగిటివిటి రావడంతో చివరికి ఫైమా బయటకు వచ్చేసింది. 

రోహిత్‌ను ఫైమా తిట్టడం వల్లే ఆమెకు నెగిటివిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైన స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అయిన ఫైమా ఎలిమినేట్‌ అవ్వడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే 13 వారాలకు గానూ ఫైమా తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జబర్దస్త్‌ లేడీ కమెడియన్‌గా మంచి ఆదరన పొందిన ఫైమాకు ఎంత రెమ్యునరేషన్‌ అందిందనేది ఆసక్తిని సంతరించుకుంది. దీంతో తను తీసుకున్న మొత్తం ఎంత అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఫైమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం బిగ్‌బాస్‌ నుంచి ఫైమాకు భారీగానే  పారితోషికం అందినట్లు తెలుస్తోంది. కాగా ఒక్కొక్కొ వారానికి గానూ ఫైమాకు బిగ్‌బాస్ రూ. 25వేల నుంచి 30 వేలు ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం చూస్తే 13 వారాల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫైమా కొనసాగింది. కాబట్టి మొత్తంగా ఆమెకు 3 లక్షల 25 వేలు ఆ పైచిలుకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.

ఒక విధంగా చూస్తే ఇది ఆమెకు మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రియాలిటీ షోలు చేసినప్పుడు ఆమెకు ఎప్పుడు కూడా ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ వచ్చింది లేదు. ఇక ఇప్పుడు కెరీర్ మొత్తంలో ఆమెకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ రావడంతో ఫైమా ఫుల్‌ ఖుషిలో ఉన్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. మరి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో ఫైమా తదుపరి కెరీర్‌ ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇకపై ఫైమా జబర్దస్త్‌లో కనిపిస్తుందా? లేదా? అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

చదవండి: 
నెక్ట్స్‌ మహానటి ఎవరు? ఆ స్టార్‌ హీరోయిన్‌ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నిర్మాతపై దుష్పచారం, నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement