అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా.. టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే | Allu Arjun's Remuneration For 'Pushpa: The Rule' - Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా.. టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే

Published Tue, Aug 29 2023 9:34 PM | Last Updated on Wed, Aug 30 2023 9:26 AM

allu arjun pushpa 2 remuneration - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప 2' విడుదలకు ముందే ఆయన ఖాతలో మరో రికార్డు వచ్చి చేరినట్లు సమచారం. పుష్ప సనిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న బన్నీని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ అవార్డు రావడంతో  టాలీవుడ్‌లో ఆయన మరో మెట్టు ఎక్కారు.  గత రెండు రోజుల నుంచి పుష్ప 2కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: పెళ్లి కబురుతో ఫోటో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ)

'పుష్ప 2' సినిమా ద్వారా టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న ఏకైక హీరో అల్లు అర్జున్‌ అని వైరల్‌ అవుతుంది. ఇప్పటికే మొదటి భాగంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు రావడం... మరోవైపు జాతీయ అవార్డు దక్కడం ఇలా ఆయనకు ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. పుష్ప 2 కోసం బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్కడి రైట్స్‌ రూ. 125 కోట్లని సమాచారం.

(ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్‌)

దీంతో పుష్ప 2 రెమ్యునరేషన్‌కు బదులుగా నార్త్‌ ఇండియా రైట్స్‌ను బన్నీ తీసుకున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాకు గాను ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ రూ. 125 కోట్లు అవుతుంది. దీనిని బట్టి టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోగా బన్నీ రికార్డులకు ఎక్కినట్లు. ఇప్పటి వరకు ప్రభాస్‌ మాత్రమే రూ. 100 కోట్లతో టాప్‌లో ఉన్నారని టాక్‌. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. టాలీవుడ్‌ కింగ్‌ అల్లు అర్జునే అని వారు కామెంటు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement