బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్-6 విన్నర్‌గా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నర్‌గా శ్రీహాన్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఈ షోలో పాల్గొన్నవారికి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అదే విషయంపై చర్చ మొదలైంది. ఈ సీజన్ రన్నరప్ శ్రీహాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లుక్కేద్దాం.
ఈ సీజన్‌లో శ్రీహాన్ ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు. ఈ 15 వారాల జర్నీతో తన మనసును సంతోషంతో నింపుకున్నారు. తోటి ఇంటిసభ్యులకోసం శ్రీహాన్ నిలబడ్డ తీరును బిగ్ బాస్ ప్రశంసించారు. బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో పాల్గొనడానికి వారానికి రూ.1.75 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో 15 వారాలకు దాదాపు రూ.26 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకోగా.. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కానీ ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచి రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ మొత్తంలో రూ.71 లక్షలు ఆర్జించాడు శ్రీహాన్
గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే: దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ఆది రెడ్డి, రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. చివరికి రేవంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుత సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. నిఖిల్, రవితేజ, రాధ, శ్రీలీల వంటి తారల రాకతో మరింత జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. కింగ్ నాగార్జున మరోసారి తన హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం ఈ సీజన్ అందరినీ బాగా అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment