
సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ మూవీ టేకింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా ఏదైనా భారీతనం ఉట్టిపడాల్సిందే. తాజాగా రామ్ చరణ్ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించబోతున్నాడట. దిల్ రాజు బ్యానర్‌లో రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమం సెప్టెంబర్‌లో అట్టహాసంగా జరిగింది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని ఈ వార్త సారాంశం. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్ చరణ్ రూ. 80 కోట్ల వరకు పారితోషకంగా అందుకోబోతున్నాడట.
ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో చెర్రీకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. శ్రీకాంత్, సునీల్ అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment