Alia Bhatt Demands Rs 5 To 6 Crore Remuneration For RRR Film - Sakshi
Sakshi News home page

Alia Bhatt-RRR Movie: 15 నిమిషాల నిడివికే అలియాకు అంత పారితోషికమా?!

Published Mon, Nov 29 2021 11:52 AM | Last Updated on Mon, Nov 29 2021 1:54 PM

Alia Bhatt Demands Rs 5 to 6 Crore Remuneration For RRR Movie - Sakshi

Alia Bhatt Remuneration in RRR Movie For 15 Min Goes Viral: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుథిరం). యంగ్‌ టైగర​ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్‌ వరుస అప్‌డేట్స్‌ వదులుతూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు.

చదవండి: సెట్‌లో గాయపడ్డ యంగ్‌ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్‌..

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీలో అలియా భట్‌ రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.  ఈ సినిమాకు అలియా మొత్తం 10 రోజుల కాల్‌షీట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె నిడివి దాదాపు 15 నిమిషాలు ఉంటుందట. దీనికే ఆమె సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలంటే ఆలియా భట్ ఉండాల్సిందేనని జక్కన్న కోరడంతో నిర్మాతలు ఒకే అన్నారంట. ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. దీంతో ఆమె రెమ్యునరేషన్‌ ఎంతో తెలిసి నెటిజన్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలుసా?

అలియాకు అంత పారితోషికం ఇవ్వడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరూ అలియా భట్‌ అంటే ఆ మాత్రం రేంజ్‌ ఉండాలంటూ మరికొందరూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో అలియా ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల తీసుకుంటుదట. రెండు మూడు నెలల కాల్‌షిట్స్‌కు 10 కోట్లు తీసుకునే ఆమె కేవలం 10 రోజులకు 5 కోట్లు వసూలు చేయడం సరికాదంటున్నారు.  హిందీ సినిమా కంటే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకే ఆమె ఎక్కువ పారితోషికం అందుకుందంటున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement