బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ప్రస్తుతం పరిశ్రమలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. 2012 ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రముఖ దర్శక-నిర్మాత మహేష్ భట్ తనయగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నటిగా తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన ప్రియుడు, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా త్వరలోనే తల్లి కాబోతోంది.
చదవండి: కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక రణ్‌బీర్-ఆలియా తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్రం మూవీ సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమె తన తొలి మూవీ రెమ్మునరేషన్ ఎంతో బయటపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లో వచ్చిన ఆలియా తన తొలి చిత్రానికి తీసుకున్న పారితోషికం చాలా తక్కువని చెప్పింది. ఫస్ట్ మూవీకి గానూ రూ. 15 లక్షల పారితోషికం అందుకున్నానని, ఆ చెక్‌ను నేరుగా తన తల్లి సోని రజ్దాన్ ఇచ్చినట్లు చెప్పింది. అప్పుడు ఇది చాలా తక్కువ అని, తన తొలి సంపాదనతో కారు కొన్నట్లు పేర్కొంది.
చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు
అయితే ఇప్పటికీ తన ఆర్థిక లావాదేవీలన్ని తన తల్లే చూసుకుంటుందని ఆలియా తెలిపింది. ‘నా బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందనేది నేనెప్పుడు చూసుకోలేదు. నా ఖాతాలో డబ్బు బాగానే ఉందని తెలుసు. నేనే నా ఆర్థిక స్థితిని చేసుకోవాలని నా టీం ఎప్పుడూ సూచిస్తుంది. ఇక కొద్దిరోజుల్లోనే మాకు బిడ్డ రాబోతున్నాడు. ఇప్పుడైన నా ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. 19 సంవత్సరాలకే సినీరంగ ప్రవేశం చేసిన నేను, నా ఫస్ట్ రెమ్యునరేషన్‌తో ఓ కారును తీసుకున్నానను. 22 సంవత్సరాల వయసులోనే ఓ ఇంటిని కొనుగోలు చేశాను’ అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment