ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..? | Sreeleela Remuneration For Shopping Malls Openings | Sakshi
Sakshi News home page

ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

Published Tue, Sep 12 2023 10:35 AM | Last Updated on Tue, Sep 12 2023 10:42 AM

Sreeleela Remuneration For Shopping Malls Openings - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తోంది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి అగ్ర నటుల చిత్రాల వరకు ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి లిస్ట్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో శ్రీలీల నటిస్తోన్న ఆరు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. 

(ఇదీ చదవండి; తండ్రితో హీరోయిన్‌ లిప్‌లాక్‌.. 33 ఏళ్ల తర్వాత రియాక్షన్‌)

మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ ధమాకా సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. త్వారలో విడుదలన కానున్న  రామ్ స్కంద  సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్‌గా తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలకు ఏకంగా ఒక సినిమా కోసం రూ. 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆమె ఒప్పుకునే సినిమాలకు సుమారు రూ. 8 కోట్లు వరకు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం.

సినిమాలతో పాటు శ్రీలీల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళ్తుంటుంది. అందుకోసం ఆమె సుమారు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ షాపింగ్‌ మాల్‌ కార్యక్రమంలో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటారట. ఆ లెక్కనా ఒక నిమిషానికి రూ. 10 లక్షల రెమ్యునరేషన్‌ అవుతుంది. వీటితో పాటు ఆమెకు అయ్యే ఫ్లైట్‌ ఖర్చులతో పాటు హోటల్‌ రూమ్స్‌ అన్నీ షాపింగ్‌ మాల్‌ నిర్వాహుకులే ఏర్పాటు చేయడం సహజం.

ఈ విషయంపై ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ రూ. 10 లక్షలా అంటూ పలువురు నోరెళ్ల బెడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. తన మొదటి రెమ్యునరేషన్‌ కేవలం రూ. 5 లక్షలే కదా అంటూ.. తను కూడా ఇండస్ట్రీలో కష్టపడి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టే వాళ్లందరూ అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్‌ వినిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement