50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌ | Nayanthara's Remuneration For 50 Second Ad Goes Viral | Sakshi
Sakshi News home page

కేవలం 50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌

Published Fri, Sep 29 2023 1:39 PM | Last Updated on Fri, Sep 29 2023 2:00 PM

 Nayanthara Remuneration For Ads - Sakshi

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ అయిన నయనతార ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర నటులందరితోనూ నటించిన నయన్‌ తాజాగా షారుక్‌ ఖాన్‌ జవాన్‌లో మెప్పించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే నయన్‌
చాలారోజుల నుంచి సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న నయన్‌ కొద్దిరోజుల క్రితం తన పిల్లల ఫోటోలు చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. నిమిషాల్లోనే ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేశారు. ప్రస్తుతం ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. నయనతార గత కొన్నేళ్లుగా కొత్త స్కిన్ కేర్ కంపెనీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్లాన్‌లో ఉంది. ఇలా ఆమె వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టడం విశేషం. తన వ్యాపార ఉత్పత్తులు షేర్‌ చేసేందుకే ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయన్‌ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రకటనకు కోట్లలో రెమ్యునరేషన్‌:
ఈ సందర్భంలో నటి నయనతార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేవలం 50 సెకన్ల ప్రకటనలకే నయనతార దాదాపు రూ. 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రకటనల సమయం అంతకు మించి పెరిగితే తన రెమ్యునరేషన్‌  కూడా పెరుగుతుందని అంటున్నారు. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా.. కొత్త మార్గాల్లో సంపాదిస్తూ.. ఏడాదికేడాది ఆస్తుల విలువను పెంచుకుంటుంది నయన్‌. 

(ఇదీ చదవండి: గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్‌ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement