తొలి తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రంగంలో టాక్ షోలను తీసుకొచ్చిన సంస్థగా ఆహా ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే సమంతతో సామ్ జామ్ అనే షోను నిర్వహించిన ఆహా.. ఈసారి ఏకంగా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్. బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ టాక్ షోను త్వరలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టే బాలయ్య బుల్లితెరపై తొలిసారిగా యాంకర్‌గా వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారు, తొలి గెస్ట్ ఎవరా అని ప్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: Unstoppable With NBK: మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా..
ఈ టాక్ షోకు బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది. ‘అన్‌స్టాపబుల్’ పేరుతో వస్తోన్న ఈ టాక్ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట. బాలయ్య రేంజ్, క్రేజ్ దృష్ట్యా అల్లు అరవింద్ అండ్ ఆహా టీం ఆయనకు భారీగానే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కో ఎపిసోడ్‌కు బాలయ్య ఏకంగా 40 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. దీంతో 12 ఎపిసోడ్‌లకు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
ఇటీవల ఈ షో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్‌ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్‌ను బండోడు అనే వారని గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ గొప్ప మనిషి.. కేవలం సినిమాలోనే నటిస్తాడు.. బయట నటించడం రాదు. కోపం వచ్చినా సంతోషం వచ్చినా నటించకుండా రియల్ ఎమోషన్స్ చూపించే మనిషి. అలాంటి వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment