Is Vijay Getting Remuneration Of More Than 100 Crore For Thalapathy 66? - Sakshi
Sakshi News home page

Vijay: భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన విజయ్‌.. తలైవాను అధిగమించాడా?

Published Thu, Dec 22 2022 9:20 AM | Last Updated on Thu, Dec 22 2022 10:22 AM

Is Tamil Hero Vijay Hikes His Remuneration More Than Rajinikanth - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో తాజాగా ఒక వార్త హల్‌ చల్‌ చేస్తోంది. పారితోషికం విషయంలో ఇప్పటివరకు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌దే పైచేయి అంటారు. ఆయన రూ.130 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటారనే ప్రచారం ఉంది. ఆ తరువాత వరుసలో దళపతి విజయ్‌ ఉన్నారు. ఈయన రూ.110 నుంచి 125 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారనేది సినీవర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. విజయ్‌ గత చిత్రం బీస్ట్‌ నిరాశ పరిచింది. అయినా ఆయన పారితోషికం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పెరుగుతూ పోతోందని సమాచారం.

చదవండి: ఆస్కార్‌ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ప్రస్తుతం ఆయన నటిస్తున్న వారీసు చిత్రానికి గతం కంటే ఎక్కువే రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నారని టాక్‌. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి భారీ తెలుగు చిత్రాలకు పోటీగా బరిలోకి దిగుతోంది. తదుపరి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి విజయ్‌ సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు మాస్టర్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. విజయ్‌ 67వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఆ తదుపరి చిత్రం గురించి కూడా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడం విశేషం.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? వధువు ఎవరంటే!

విజయ్‌ 68వ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇది రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్నట్లు టాక్‌. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి  విజయ్‌కి రూ.150 కోట్లు పారితోషికం అని,  దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో ఇంతకు ముందు తెరి, మెర్సల్, బిగిల్‌ వంటి హ్యాట్రిక్‌ చిత్రాలు వచ్చాయి. కాగా దర్శకుడు అట్లీ ప్రస్తుతం షారుక్‌ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీన్ని  2023 సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement