స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. అంతేకాదు రెమ్యునరేషన్‌లో కూడా మిగతా హీరోయిన్ల కంటే ముందే ఉంది. ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం. అలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న పూజాకు 2022తో బ్రేక్ పడిందా? అనిపిస్తోంది. చెప్పాలంటే 2022 ఆమెకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. గతేడాది విడుదలైన ఆమె చిత్రాలు రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా పరాజయం పొందాయి.
చదవండి: శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్‌మెయిల్!
అప్పటి వరకు లక్కీ లెగ్‌గా దర్శక-నిర్మాతల ఆదరణ పొందిన ఆమెకు వరుస ప్లాప్‌లు షాకిచ్చాయి. దీంతో ఈ బుట్టబొమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు. మహేశ్ SSMB28 తప్పా ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది. అయితే తెలుగులో అలా వైకుంఠపురం చిత్రం వరకు పూజా కెరీర్ తిరుగులేదు అన్నట్లు సాగింది. అందుకే ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంతా వెనకాడకుండా దర్శక-నిర్మాతలు పారితోషికం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమె కథ అంతా మారిపోయింది. ఈ తాజా బజ్ ప్రకారం పూజా కెరీయర్ ఉన్నట్టుండి తలకిందులైనట్లు తెలుస్తోంది.
చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..!
ఆఫర్ కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందేనంటూ నిర్మాతలు షాకిస్తున్నారట. తను అడిగినంత ఇచ్చేందుకు రెడీగా లేమంటూ చేతులెత్తేస్తున్నారని ఫిలిం సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఆఫర్ కావాలంటే రూ. 50 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అంటున్నారట. దీంతో పూజా తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాంటే బుట్టబొమ్మ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బీస్ట్ మూవీ సమయంలో తన స్టాఫ్ హోటల్, మెయింటెనెన్స్ బిల్లులపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లులు తనే కట్టుకోవాలని మూవీ నిర్మాతలు చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment