![Anchor Pradeep Tests Positive For Coronavirus Rumors Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/23/anchor-pradeep.jpg.webp?itok=9x-QqUxv)
కరోనా సెకండ్ వేవ్‌కి దేశం అతలాకుతలం అవుతోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కర్ప్యూ, లాక్‌డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. కొంతమంది ఇప్పటికీ ఐసోలేషన్‌ల్లో ఉన్నారు.
తాజాగా ప్రముఖ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ షోకి యాంకర్ రవి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ప్రదీప్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
చదవండి:
అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ
క్వారంటైన్‌లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్
Comments
Please login to add a commentAdd a comment