బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత | Pradeep Will Provide Financial Assistance To 60 Daily Wage Workers From Television | Sakshi
Sakshi News home page

కరోనా కష్టాలు : టెలివిజన్‌ కార్మికులకు అండగా ప్రదీప్‌

Published Sun, Mar 29 2020 9:15 AM | Last Updated on Sun, Mar 29 2020 9:23 AM

Pradeep Will Provide Financial Assistance To 60 Daily Wage Workers From Television - Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వల్ల  దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. వీటిలో సినీ, టెలివిజన్‌ రంగాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల  సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరందరికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.
(చదవండి : కరోనా కష్టాలు... టాలీవుడ్‌ హీరోల భారీ విరాళాలు)

‘ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఇంట్లో ఉండటం చాలా చాలా సేఫ్. అలా ఉండటమే చాలా ఉత్తమం. మనం ఇంట్లో ఉండటం కరోనా వ్యాప్తి చెందకుండా దాని చైన్‌ను బ్రేక్ చేసినవాళ్లం అవుతాం. మన ద్వారా వేరేవాళ్లకు కానీ.. వాళ్ల ద్వారా మనకి కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండటం వెరీ వెరీ సేఫ్. దయచేసి అందరూ దీన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఫాలో అవుతున్న వాళ్లు దాన్నే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను.
(చదవండి : కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌)

దీంతో పాటు ఇంట్లో వాళ్లతో గడిపే సమయం దొరికింది. మూవీస్, టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. వీటిలో ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్ మనకి టెలివిజన్ ద్వారా వస్తోంది. ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మనకి అందించడానికి కొన్ని వందల మంది వాటి వెనుక పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది రోజువారీ కార్మికులు ఉంటారు. నా షోలకు పనిచేసేవాళ్లే కాకుండా చాలా షోలు, సీరియల్స్‌కు వీళ్లు పనిచేస్తారు. ఆరోజు షూటింగ్ జరిగితే దాని ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.

చాలా రోజుల నుంచి షూటింగ్‌లు జరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు జరగకుండా ఉంటాయో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్లకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులకు సంబంధించి నాకు తెలిసిన 50 నుంచి 60 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లందరికీ ఒక నెలకు సరిపడే ఆర్థిక సహాయాన్ని నేను చేద్దామని అనుకుంటున్నాను. నా తరఫున ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది నా టెలివిజన్ ఫ్యామిలీ. నేను షోలు చేయడానికి వీళ్లంతా ఎంతగానో సహాయం చేశారు. అందుకే, వాళ్లు కనీస అవసరాలు పొందడానికి నేను సాయం చేస్తాను. ఇలాగే మీకు తెలిసిన దినసరి కార్మికులు కూడా చాలా మంది ఉండొచ్చు. వారికి కాల్‌ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. మీకు తోచిన సహాయం చేయండి. మనం మన ఇంట్లోనే ఉంటూ ఇంకో ఇంటి గురించి ఆలోచిద్దాం’ అని ప్రదీప్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement