యాంకర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. డుయో నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తున్నారు. మాంక్స్– మంకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి క్రిస్మస్ సందర్భంగా ‘టచ్‌లో ఉండు..’ అంటూ సాగే ద్వితీయ పాటని రిలీజ్ చేశారు.
రధన్ ఈ మూవీకి సంగీతం అందించారు. టచ్‌లో ఉండు..’ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. ‘‘యునిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ప్రదీప్, చంద్రికా రవిలపై చిత్రీకరించిన ‘టచ్‌లో ఉండు..’ మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్‌ఎన్ బాలరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment