Anchor Pradeep Machiraju Refutes Rumours of Engagement - Sakshi
Sakshi News home page

Anchor Pradeep: పెళ్లి వార్తలపై ప్రదీప్‌ ఏమన్నాడంటే?

Published Wed, Dec 28 2022 1:06 PM | Last Updated on Wed, Dec 28 2022 1:38 PM

Anchor Pradeep Machiraju Refutes Rumours of Engagement - Sakshi

తెలుగు స్టార్‌ యాంకర్‌లలో ప్రదీప్‌ ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ఎంటర్‌టైన్‌ చేసే ప్రదీప్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ఊహాగానాలపై ప్రదీప్‌ స్పందిస్తూ అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నేను కాస్త బిజీగా ఉండటం వల్ల దీనిపై ఇప్పటివరకు స్పందించలేకపోయాను. ఇకపోతే నిశ్చితార్థం, పెళ్లి.. ఏదీ లేదు. నేనిప్పటికీ సింగిలే! పాపం.. ఎవరో డిజైనర్‌తో ఏడడుగులు వేయబోతున్నానని రాసేశారు.

కానీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. బహుశా.. నా టీమ్‌ ఆమె రెడీ చేసిన డ్రెస్సులు కొని ఉండొచ్చేమో కానీ అనవసరంగా ఆమె పేరు లాగకండి. ఇప్పట్లోపెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ఇప్పుడిప్పుడే నా కుటుంబం తండ్రిని కోల్పోయిన బాధలో నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం నా దృష్టంతా టీవీ షోలు, సినిమాపైనే ఉంది. నేను హీరోగా మరో సినిమా చేస్తున్నాను. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఆ సినిమా రిలీజ్‌ చేస్తాం' అని చెప్పుకొచ్చాడు ప్రదీప్‌.

చదవండి: యాంకరింగ్‌కు బ్రేక్‌? పుట్టిందే టీవీ కోసమన్న సుమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement