
బుల్లితెర మీద సత్తా చాటిన చాలా మంది యాంకర్లు వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, రవి లాంటి వారు ఈ లిస్ట్‌లో చేరగా తాజా మరో స్టార్ యాంకర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అధికారిక ప్రకటన రాకపోయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాకు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ సంగీతమందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment