Pradeep Machiraju Promised to Help Netizen Who Claimed to Be Poor Engineering Student - Sakshi
Sakshi News home page

Pradeep Machiraju: వైరల్‌ అవుతున్న యాంకర్‌ ప్రదీప్‌ ట్వీట్‌, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు

Published Thu, Dec 30 2021 3:19 PM | Last Updated on Thu, Dec 30 2021 8:12 PM

Pradeep Machiraju Heartwarming Gesture leaves Fans Overwhelmed - Sakshi

ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ విద్యార్థి చేసిన ట్వీట్‌కు ప్రదీప్‌ ఇచ్చిన రిప్లై నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకి ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆర్థిక సాయం కోరుతూ ప్రదీప్‌ను ట్యాగ్‌ చేశాడు. ‘మా కుటుంబ పరిస్థితి అసలు బాగోలేదు. మా నాన్న ఇటీవల కరోనా కారణంగా చనిపోవడంతో ఆర్థికంగా కుంగిపోయాం. దీంతో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నేను..

చదవండి: ‘ఆశ: ఎన్ కౌంటర్’ సినిమా దిశ ఘటన గురించి కాదు!: ఆర్జీవీ

ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మా సిస్టర్‌ చాలా కష్టాల్లో ఉన్నాం. దయచేసి మీ నుంచి కొంత డబ్బు సాయం కావాలి. మా కుటుంబ పరిస్థితి గురించి మీకు తెలియలాంటే ప్రూఫ్‌ కూడా చెబుతాను’ అంటూ తన ఫోన్‌ నెంబర్‌ ఇస్తూ ప్రదీప్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆర్థిక సాయం కోరాడు. అది చూసిన  ప్రదీప్‌ ఉదారతతో సదరు నెటిజన్‌కు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండా బ్రదర్‌. నాకు చేతనైనా సాయం చేస్తాను. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీ వివరాలను నాకు పంపించండి’ అంటూ అతడికి భరోసా ఇచ్చాడు.

చదవండి: SS Thaman: ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన తమన్‌ వరుస ట్వీట్లు

ప్రదీప్‌ ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చిన తీరుపై ప్రతిఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘అందుకే నేను మీకు ఫ్యాన్‌ అయ్యాను దీపూ, మీరు చాలా గ్రేట్‌’, ప్రస్తుతం మీరు వాళ్లకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు బ్రదర్‌’ అంటూ పలువురు ప్రదీప్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తున్నారు. కాగా కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ప్రదీప్‌ ఇదివరకు కూడా ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఆర్థిక సాయం కోరిన పలువురికి ప్రదీప్‌ చేతనైనా సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement