Ram Gopal Varma Viral Tweet About Covid Cases Increase In India, RGV Stunning Feedback Displaying Woman T-shirt - Sakshi
Sakshi News home page

వైరల్‌: అమ్మాయి టీ-షర్ట్‌పై ఆర్జీవీ కొంటె కామెంట్‌..

Published Fri, Apr 30 2021 7:25 PM | Last Updated on Fri, Apr 30 2021 8:54 PM

Ram Gopal Varma Comments On Women T Shirt Over Coronavirus - Sakshi

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయంపై స్పందించిన అది వార్తల్లో నిలవాల్సిందే. సమాజంలో తనకు ఎదురైన సంఘటనలపై వ్యంగ్యస్త్రాలు సందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. ఇక ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై రకరకాలుగా స్పందిస్తు వస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఓ అమ్మాయి ధరించిన టీ-షర్ట్‌ ఫొటోను షేర్‌ చేస్తూ తనదైన శైలిలో స్పందించాడు.

ఆ అమ్మాయి టీ-షర్ట్‌పై... ‘2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాం. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాం. 2021లో మనుషులనే దూరంగా పెడుతున్నాం’   అని రాసి ఉంది. అది చూసిన ఆర్జీవీ ఈ ఫొటోను షేర్‌ చేసి ‘2022... మనుషులే ఉండకపోవచ్చు’  అంటూ కొంటెగా కామెంట్‌ చేశాడు. ఈ పోస్టు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ‘పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వర్మ చెప్పిందే నిజం అవుతుంది’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. 

చదవండి: 
కరోనాపై ఆటం బాంబు పేల్చిన రామ్‌గోపాల్‌ వర్మ 

ఎన్టీఆర్‌, అఖిల్‌పై ఆర్‌జీవీ షాకింగ్‌ కామెంట్స్!‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement