30 Rojullo Preminchadam Ela: ఓటీటీలో చూసేయండి | 30 Rojullo Preminchadam Ela Now Streaming On Amazon Prime | Sakshi
Sakshi News home page

30 Rojullo Preminchadam Ela: ఓటీటీలో చూసేయండి

Published Sun, May 23 2021 2:23 PM | Last Updated on Sun, May 23 2021 7:48 PM

30 Rojullo Preminchadam Ela Now Streaming On Amazon Prime - Sakshi

బుల్లితెర టాప్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి. తన పంచులతో, తనదైన యాంకరింగ్‌తో వినోదాల విందును పంచే ఈ యాంకర్‌ హీరోగా నటించిన తొలి సినిమా "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఇక ఇందులో అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే.

జనవరి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతోపాటు విడుదలైన తొలి రోజే రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించి ప్రదీప్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' స్ట్రీమింగ్‌ అవుతోంది. కాబట్టి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు వెంటనే దీన్ని ఓటీటీలో వీక్షించవచ్చు.

చదవండి: విషాదం: యాంకర్‌ ప్రదీప్‌ తండ్రి కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement