30 Rojullo Preminchadam Ela Movie
-
30 Rojullo Preminchadam Ela: ఓటీటీలో చూసేయండి
బుల్లితెర టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి. తన పంచులతో, తనదైన యాంకరింగ్‌తో వినోదాల విందును పంచే ఈ యాంకర్ హీరోగా నటించిన తొలి సినిమా "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా ఆకట్టుకుంది. ఇక ఇందులో అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. జనవరి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతోపాటు విడుదలైన తొలి రోజే రూ.4 కోట్ల గ్రాస్ సాధించి ప్రదీప్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వెంటనే దీన్ని ఓటీటీలో వీక్షించవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: విషాదం: యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత -
అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్ ప్రదీప్
సాక్షి, ఖమ్మం: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా యూనిట్ ఆదివారం సాయంత్రం ఖమ్మంలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శించబడుతున్న తిరుమల థియేటర్‌కు యాంకర్ ప్రదీప్ రాగా.. అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులతో ముచ్చటించి, సినిమా ఎలా ఉందో తెలుసుకున్నారు. తనను ఆదరిస్తున్న వారందరికీ ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులను స్వయంగా కలుసుకునేందుకే తమ యూనిట్ ఖమ్మంకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు మున్నా, నిర్మాత శ్రీనివాసరావు, థియేటర్ మేనేజర్ సంగబత్తుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇస్మార్ట్ సోహైల్‌కు గ్రాండ్ వెల్కమ్ గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు -
‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ పాట రచయితెవరు?
పునర్జన్మలు ఉన్నాయా, లేవా? అంటే ఎవరి సమాధానం వారికి ఉంటుంది. ఆ వాదన పక్కనపెడితే పునర్జన్మల ఆధారంగా తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి... వస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..’ సినిమా కూడా పునర్జన్మల కథ నేపథ్యంలోనే తెరకెక్కంది. ఇటువంటి చిత్రాలపై స్పెషల్ క్విజ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్
తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో బుల్లితెరపై గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఈ శుక్రవారం(జనవరి 29) విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.4 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తన తొలి సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ ఎమోషనల్ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి : ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ రివ్యూ) ‘ఒక చిన్న సినిమాకి విశేష స్పందన అందింది. ఎన్నో రోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యం అయింది. నా కెరీర్లో అతిపెద్ద అడుగు నేను వేసేటప్పుడు ఇంతమంది సపోర్ట్ నాకు ఉండడం, అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ఇంతమంది ప్రజలు థియేటర్స్‌కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు. ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను’అని ప్రదీప్ మాచిరాజు ట్వీట్ చేశాడు. జనం మెచ్చిన సినిమా.. #30RojulloPreminchadamEla, First Day Worldwide Gross 4 Crores🤩 అందరి నోట ఒకటే మాట, పాటంత బాగుంది సినిమా! ❤️@impradeepmachi @Actor_Amritha@DirectorMunna1 @anuprubens #GA2UV @UrsVamsiShekar @SVProductions5 @LahariMusic #NeeliNeeliAakasamAnthaHit pic.twitter.com/4RHQdAQYJS — Ramesh Bala (@rameshlaus) January 30, 2021 -
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ రివ్యూ
టైటిల్ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్ ఆది తదితరులు నిర్మాణ సంస్థ : ఎస్వీ ప్రొడక్షన్ నిర్మాత : ఎస్వీ బాబు దర్శకత్వం : మున్నా ధూళిపూడి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర విడుదల తేది : జనవరి 29, 2021 బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యతగా తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో అదరగొట్టే ప్రదీప్ మాచిరాజు.. సుమ తరువాత గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక తొలిసారి హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే డిఫెరెంట్ టైటిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(జనవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ తనకు మంచి పేరు తీసుకొస్తుందన్న ధీమాలో ప్రదీప్ ఉన్నాడు. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండి తెరపై ఏ స్థాయిలో రాణించాడు? హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూలో తెలుసుకుందాం. కథ వైజాగ్‌లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే అల్లరి స్టూడెంట్ అర్జున్(ప్రదీప్ మాచిరాజు). చదువంటే ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్ అంటే ప్రాణం. అదే కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థిని అక్షర(అమృతా అయ్యర్). అమృతకి, అర్జున్‌కి అసలే పడదు. ఒకరంటే ఒకరికి కోపం, పగ, ద్వేషం. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? వీరి జీవితాలకు, స్వామీజికి సంబంధం ఏంటి? వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఎందుకు పడదు? ఇష్టం లేని వీరిద్దరు ఎందుకు ప్రేమించుకోవాల్సి వచ్చింది? చివరకు వీరి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు ప్రదీప్. తనదైన కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమర్‌తో ఎన్నో షోలను విజయవంతం చేశాడు. షోలో ప్రదీప్ ఉంటే చాలు కామెడీకి కొదవ ఉండదు. తొలి సినిమాలో కూడా అదే కామెడీతో నవ్వించాడు ప్రదీప్. అర్జున్ అను అల్లరి స్టూడెంట్ పాత్రలో జీవించేశాడు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు. యాంకర్‌గా తనకున్న ఎక్స్పీరియన్స్ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు. ప్రదీప్ తర్వాత బాగా పండిన పాత్ర అమృతది. అక్షర అనే యువతి పాత్రలో అమృత జీవించేసింది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్ ఆది, మహేశ్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఇది తొలి సినిమా. మొదటి సినిమాతోనే ప్రదీప్‌తో ప్రయోగం చేయించాడు దర్శకుడు మున్నా. పునర్జన్మల కథ ఎంచుకుని దర్శకుడు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ఆ కథని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉండవు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సీరియస్ కథ అయినా.. కామెడీతో నడిపించే ప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు. హీరో, హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అలాగే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ను కామెడీగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా నడుపుదామనుకొని కాస్త విఫలం అయ్యాడు. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం..' పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగా లేదు. కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే. ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగాలేదు కానీ, చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ అనూప్ రూబెన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ కథాకథనం సాగదీత సీన్లు ప్రీ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా సినిమాని కుటుంబమంతా కలసి చూడొచ్చు
‘‘నేనీ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. నా మీద నమ్మకంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు మున్నా. నా మొదటి సినిమాకే అంత మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత బాబుగారు దొరకడం నా అదృష్టం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ నీలి నీలి ఆకాశం..’ పాట ఒక ఏడాదంతా వినేలా చేసిందంటే మామూలు విషయం కాదు. పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా ‘పటాస్’ సినిమాని యస్వీ బాబుగారు కన్నడలో రిలీజ్ చేశారు. ఆయన తెలుగులో నిర్మించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సూపర్ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘అనూప్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రదీప్ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మా సినిమాకి ఓటీటీ రిలీజ్‌కి ఆఫర్స్ వచ్చినా మా కష్టాన్ని గుర్తించిన బాబుగారు థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు ఫణి ప్రదీప్. ‘‘ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది. మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అన్నారు చిత్రనిర్మాత ఎస్వీ బాబు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంతలా హిట్ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనంతరం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్లాటినమ్ డిస్క్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, హీరో అడవి శేష్, నిర్మాత సి. కల్యాణ్, కెమెరామాన్ శివేంద్ర, సింగర్స్ సునీత, సిద్ శ్రీరామ్, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్నారు. -
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
‘ఉద్యోగం వచ్చిందని ఏడ్చాను’
‘‘డైరెక్టర్ అవ్వాలనేది నా కల. నాకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చినప్పుడు ఇంట్లో ఆనందపడ్డారు. నేను మాత్రం డైరెక్టర్ అవుదామనుకుంటే ఇంజినీర్ని అయ్యానే అని ఏడ్చాను’’ అన్నారు ఫణి ప్రదీప్ (మున్నా). యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. చిత్రదర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2011లో ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. సుకుమార్‌గారి దగ్గర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే, 100 పర్సెంట్ లవ్’ చిత్రాలకు రచయితల విభాగంలో చేశాను. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, హిట్ అయిన ‘నువ్వేకావాలి, ఆనందం, నువ్వు నేను, క్షణం, స్వామిరారా’ సినిమాల స్ఫూర్తితో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథ రాశాను. ఈ కథని నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి చెబితే, ఆయన దగ్గరుండి స్క్రీన్‌ప్లే రాయించారు. గీతా ఆర్ట్స్‌లో చేయాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా కజిన్, నటుడు భద్రం ద్వారా ఎస్వీ బాబుగారిని కలిశాను. ఆయనకు కథ నచ్చడంతో నిర్మించారు. మా అమ్మ, నా భార్య హీరోగా ప్రదీప్ అయితే బాగుంటాడు? అనడంతో నిర్మాతగారికి చెప్పడంతో ఓకే అన్నారు. సినిమా చూసిన ‘బన్నీ’ వాసుగారు మా బ్యానర్లో విడుదల చేస్తాం అన్నారు. ప్రస్తుతం రెండు పెద్ద బ్యానర్లలో అవకాశం వచ్చింది’’ అన్నారు. -
ట్రైలర్: హీరోయిన్‌తో ప్రదీప్ లిప్‌లాక్!
ప్రదీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. నువ్వు వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలయింది. ఇందులో ప్రదీప్ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా రెండు రకాల పాత్రలు చేసినట్లు కనిపిస్తోంది. పైగా ప్రదీప్ లిప్‌లాక్ సీన్లో కూడా నటించినట్లు తెలుస్తోంది. హైపర్ ఆది, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళీ వంటి కమెడియన్లు కూడా ఉండటంతో వినోదానికి ఏమాత్రం ఢోకా లేనట్లు కనిపిస్తోంది. (చదవండి: 30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!) ఎప్పుడూ పంచ్‌లు వేసి అలరించే ప్రదీప్ ఈ సినిమాలో కూడా వాటిని సమయానుసారం వాడినట్లు కనిపిస్తోంది. మొత్తానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న హీరోహీరోయిన్లు ఎలాగైనా సరే 30 రోజుల్లో ప్రేమించుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి వారు అంత తక్కువ టైములో ప్రేమలో పడతారా? లేదా? అనేది సస్పెన్స్. అయినా ప్రేమ పుట్టడానికి క్షణం చాలదంటారు. కాబట్టి తప్పకుండా నెల రోజుల్లో లవ్‌సాంగ్స్ పాడుకుంటారని చెప్తున్నారు నెటిజన్లు. అంతే కాదు పాట అంత బాగుంది ట్రైలర్ అని మెచ్చుకుంటున్నారు. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రొడ్యూసర్ ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. పాటలతో సంచనాలు సృష్టిస్తోన్న ఈ సినిమా జనవరి 29న విడుదల కానుంది. (చదవండి: మెగాస్టార్‌తో అవకాశం.. తమన్ భావోద్వేగం) -
30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!
ప్రదీప్ మాచిరాజు.. ఇప్పటివరకు యాంకర్‌గానే పరిచయం. కొన్ని సినిమాల్లో హీరోకు స్నేహితుడుగానూ కనిపించాడు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంతోమంది ప్రేక్షకుల సెల్ఫోన్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. (చదవండి: చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్) ఈ సినిమాను గతేడాది ఉగాదికి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలన్న సంకల్పంతో ఓటీటీ వైపు కూడా మొగ్గు చూపలేదు. దీంతో రిలీజ్ ఆలస్యమవగా మొత్తానికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 29న రిలీజ్ అవనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. పాట అంత బాగుంటుంది ఈ సినిమా అని ప్రేక్షకులను ఊరిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్‌తో మ్యాజిక్ చేసిన ప్రదీప్ ఈ సినిమాతో జనాలను ఎలా మాయ చేస్తారో చూడాలంటే రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్) Jan 29th !!!!😊 With all your love and support 🙏#GA2 nd #UV release @DirectorMunna1@Actor_Amritha @anuprubens @SVProductions5 @boselyricis @UrsVamsiShekar @LahariMusic @Dsivendra pic.twitter.com/DteqclKWH0 — Pradeep Machiraju (@impradeepmachi) January 11, 2021 -
హీరోయిన్ అమృత అయ్యర్ బ్యూటిపుల్ ఫోటోస్
-
నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మున్నా, ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటతో సహా అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్, అమృతలపై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట పది కోట్ల వ్యూస్ దాటడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. కాగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని జీఏ2, యూవీ క్రియేష¯Œ ్స సంస్థలు విడుదల చేయనున్నాయి. -
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ప్రెస్ మీట్
-
మంచి కథతో వస్తున్నాం
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. యస్.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మున్నా మాట్లాడుతూ– ‘‘నేను ఎంసీఏ చదివే రోజుల్లో సుకుమార్‌గారి వద్ద పనిచేయాలనుకున్నా. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్‌గా పని చేశాను. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కథని అల్లు అర్జున్‌గారికి, ‘బన్నీ’ వాసుకి చెప్పాను. వారు కొన్ని సలహాలిచ్చారు. ‘బన్నీ’ వాసు మా సినిమాని జీఎ2 పతాకంపై విడుదల చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘హీరోలు మహేశ్‌బాబు, రానా, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా మా సినిమాని సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. అనూప్ మంచి సంగీతం ఇచ్చారు. మున్నా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి మనుషులు కలిసి చేసిన ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాటకు మంచి స్పందన వచ్చింది. అనూప్ చక్కని సంగీతం ఇచ్చారు. చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు యస్.వి.బాబు. ‘‘ఇది నా తొలి చిత్రం. మంచి పాత్ర ఇచ్చినందుకు మున్నాకి థాంక్స్’’ అన్నారు అమృతా అయ్యర్. సహ నిర్మాత వినయ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివ, ఆర్ట్ డైరెక్టర్ నరేష్ మాట్లాడారు. -
పండక్కి సిద్ధం
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాని ఉగాదికి ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఔట్పుట్ నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ‘‘రొమాంటిక్ కామెడీగా రూపొందిన చిత్రమిది. ఇందులోని ‘నీలి నీలి ఆకాశం..’, ‘ఇదేరా స్నేహం..’ పాటలు సంగీత ప్రియుల ఆదరణను అమితంగా పొందాయి. మహేశ్ బాబు విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సెన్సేషనల్ హిట్టయి, ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ సాధించింది. తాజాగా విడుదల చేసిన ‘మీకో దండం..’ పాట 24 గంటల్లో 3 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష, ‘హైపర్’ ఆది తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమిృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రదీప్ ఫాలోవర్స్‌కు చిత్ర బృందం తీపి కబురు తెలిపింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్ డేట్‌కు సంబంధించి పోస్టర్స్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్సందన వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సాంగ్ 60 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మార్చి 25న విడుదల కాబోతున్న నాలుగు చిత్రం ఇది. అదే డేట్‌న నాని, సుధీర్ల ‘వి’, రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’,తో పాటు ‘అమృతరామమ్’ చిత్రాలు రీలీజ్ కానున్నాయి. చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’ -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’
బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. మున్నా దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ కథానాయిక. ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపిస్తారు.. ఆయన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో–హీరోయిన్ల మధ్య సన్నివేశాలు భావోద్వేగంతో ఉంటాయి. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ దృశ్యకావ్యంలా తెరకెక్కించారు. హీరో మహేశ్‌బాబు చేతుల మీదగా ఇటీవల విడుదలైన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం ఈమధ్య కాలంలో మాదే. సంగీతప్రియులు ఈ స్థాయిలో పాటను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం!
బుల్లితెర ప్రఖ్యాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై పాజిటీవ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు చిత్ర ప్రమోషన్లు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే మూవీ మ్యూజిక్ పోస్టర్‌ను రానా విడుదల చేయగా.. తొలి పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని రెండు లిరికల్ సాంగ్ మిల్క్ బ్యూటీ తమన్నా తన అధికారిక ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు తమన్నా బెస్ట్ విషెస్ తెలిపారు. కాగా, ఈ చిత్రం కోసం తమన్నా తన వంతు సాయాన్ని ఈ విధంగా చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం.. ఇది హృదయం అడిగే స్నేహం.. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకు పడమరకు కాంతి తోరణమైందీ స్నేహం’అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ యూత్‌ను కట్టిపడేస్తోంది. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అర్మాన్ మాలిక్ ఆలపించాడు. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. స్నేహానికి సంబంధించి ఈ పాటలో చంద్రబోస్ అందించిన లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. Happy to launch this beautiful song #IderaSneham from #30RojulloPreminchadamEla 😊 So happy for u my dear @impradeepmachi and wishing entire team the best 👍😊https://t.co/UI1Y3dlSoO — Tamannaah Bhatia (@tamannaahspeaks) February 16, 2020 చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘సామజవరగమన’ వీడియో సాంగ్ వచ్చేసింది! నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే -
నీలి నీలి ఆకాశం..
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటకి మంచి ఆదరణ రావడంతో ఆ పాట విజయోత్సవాన్ని నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మొదట చూసిన ప్రేక్షకుడు హీరో మహేశ్‌బాబుగారు. ఆయనే ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటను అందరూ పాడుతున్నారు. అనూప్ రూబెన్స్ గొప్ప ట్యూన్ ఇస్తే, చంద్రబోస్‌గారు గొప్ప సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనూప్ రూబె¯Œ ్స. ‘‘ఒక పాటకు విజయోత్సవం జరగడం ఇదే మొదటిసారి’’ అన్నారు చంద్రబోస్. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట అద్భుతాలు సృష్టించింది’’ అన్నారు గాయని సునీత. ‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు ఎస్వీ బాబు. ‘‘నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు అమృతా అయ్యర్. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా డైరెక్టర్ మున్నా అసలు పేరు ప్రదీప్. అంటే ఈ సినిమాకి ఇద్దరు ప్రదీప్‌లు పని చేశారు. ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మహేశ్‌బాబుగారు విడుదల చేయడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరికీ చేరువయింది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. -
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ప్రెస్ మీట్
-
‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా
ప్రదీప్ మాచిరాజు, అమ్రిత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రదీప్ హీరోగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి పాలోయింగ్ ఉన్న ఈ యాంకర్ తన తొలి సినిమా కోసం ప్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. దీనికి తగ్గట్టు ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ప్రకటించడంతో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. అంతేకాకుండా చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకనే విధంగా ఉంది. తాజాగా మూవీ ఫస్ట్ సాంగ్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా’అంటూ ప్రేయసికి కానుకగా ఏమి ఇవ్వాలో తెలియక గందరగోళంలో ఉన్న ఓ ప్రేమికుడి మనసులోని భావాలను అద్భుతమైన పాటగా తీర్చిదిద్ది విడుదల చేశారు. ప్రేమ పాటల ఎక్స్పర్ట్ అనూప్ రుబెన్స్ ఈ పాటను కంపోజ్ చేయగా.. చాలా కాలంగా వెండితెరపై పేరు కనిపించని చంద్రబోస్ ఈ పాటకు హృదయానికి హత్తుకునే లిరిక్స్ అందించాడు. సిద్ శ్రీరామ్, సునీతలు తమ గాత్రంతో ఈ పాటకు ఊపిరి పోశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేమికులకు చాలా బాగా కనెక్ట్ అయింది. దీంతో ప్రతీ ప్రేమికుడు తన ప్రేయసికి ఈ పాటను కానుకగా అందిస్తున్నాడు. ఈ పాటలోని కొన్ని పదాలు మచ్చుకకు మీకోసం.. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా, నెలవంకను ఇద్దామనుకున్నా.. నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకు ఏమి ఇవ్వనే.., నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే.. ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలె, ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా.. ఏదీ నీసాటి రాదిక అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా?’అనే లిరిక్స్ వావ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట మూడు మిలియన్ వ్యూస్‌కు పైగా సొంతం చేసుకుని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: అమీ.. ఏమాత్రం తగ్గడం లేదుగా! ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’