అమృత, ప్రదీప్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటకి మంచి ఆదరణ రావడంతో ఆ పాట విజయోత్సవాన్ని నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మొదట చూసిన ప్రేక్షకుడు హీరో మహేశ్‌బాబుగారు. ఆయనే ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటను అందరూ పాడుతున్నారు. అనూప్ రూబెన్స్ గొప్ప ట్యూన్ ఇస్తే, చంద్రబోస్‌గారు గొప్ప సాహిత్యం అందించారు’’ అన్నారు.
‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనూప్ రూబె¯Œ ్స. ‘‘ఒక పాటకు విజయోత్సవం జరగడం ఇదే మొదటిసారి’’ అన్నారు చంద్రబోస్. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట అద్భుతాలు సృష్టించింది’’ అన్నారు గాయని సునీత. ‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు ఎస్వీ బాబు. ‘‘నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు అమృతా అయ్యర్. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా డైరెక్టర్ మున్నా అసలు పేరు ప్రదీప్. అంటే ఈ సినిమాకి ఇద్దరు ప్రదీప్‌లు పని చేశారు. ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మహేశ్‌బాబుగారు విడుదల చేయడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరికీ చేరువయింది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment