
30 రోజుల్లో ప్రేమించడం ఎలా రిలీజ్ డేట్ వచ్చేసింది..
ప్రదీప్ మాచిరాజు.. ఇప్పటివరకు యాంకర్‌గానే పరిచయం. కొన్ని సినిమాల్లో హీరోకు స్నేహితుడుగానూ కనిపించాడు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంతోమంది ప్రేక్షకుల సెల్‌ఫోన్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. (చదవండి: చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్)
ఈ సినిమాను గతేడాది ఉగాదికి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలన్న సంకల్పంతో ఓటీటీ వైపు కూడా మొగ్గు చూపలేదు. దీంతో రిలీజ్ ఆలస్యమవగా మొత్తానికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 29న రిలీజ్ అవనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. పాట అంత బాగుంటుంది ఈ సినిమా అని ప్రేక్షకులను ఊరిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్‌తో మ్యాజిక్ చేసిన ప్రదీప్ ఈ సినిమాతో జనాలను ఎలా మాయ చేస్తారో చూడాలంటే రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్)
Jan 29th !!!!😊
— Pradeep Machiraju (@impradeepmachi) January 11, 2021
With all your love and support 🙏#GA2 nd #UV release @DirectorMunna1@Actor_Amritha @anuprubens @SVProductions5 @boselyricis @UrsVamsiShekar @LahariMusic
@Dsivendra pic.twitter.com/DteqclKWH0