ప్రదీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. నువ్వు వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అన్న హీరో డైలాగ్‌తో ట్రైలర్ మొదలయింది. ఇందులో ప్రదీప్ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా రెండు రకాల పాత్రలు చేసినట్లు కనిపిస్తోంది. పైగా ప్రదీప్ లిప్‌లాక్ సీన్‌లో కూడా నటించినట్లు తెలుస్తోంది. హైపర్ ఆది, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళీ వంటి కమెడియన్లు కూడా ఉండటంతో వినోదానికి ఏమాత్రం ఢోకా లేనట్లు కనిపిస్తోంది. (చదవండి: 30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!)
ఎప్పుడూ పంచ్‌లు వేసి అలరించే ప్రదీప్ ఈ సినిమాలో కూడా వాటిని సమయానుసారం వాడినట్లు కనిపిస్తోంది. మొత్తానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న హీరోహీరోయిన్లు ఎలాగైనా సరే 30 రోజుల్లో ప్రేమించుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి వారు అంత తక్కువ టైములో ప్రేమలో పడతారా? లేదా? అనేది సస్పెన్స్. అయినా ప్రేమ పుట్టడానికి క్షణం చాలదంటారు. కాబట్టి తప్పకుండా నెల రోజుల్లో లవ్‌సాంగ్స్ పాడుకుంటారని చెప్తున్నారు నెటిజన్లు. అంతే కాదు పాట అంత బాగుంది ట్రైలర్ అని మెచ్చుకుంటున్నారు. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రొడ్యూసర్ ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. పాటలతో సంచనాలు సృష్టిస్తోన్న ఈ సినిమా జనవరి 29న విడుదల కానుంది. (చదవండి: మెగాస్టార్‌తో అవకాశం.. తమన్ భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment