ప్రదీప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన మహేష్‌..  | Mahesh Babu Unveils Pradeep Machiraju Movie Video Song | Sakshi
Sakshi News home page

ప్రదీప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన మహేష్‌.. 

Published Fri, Jan 31 2020 7:29 PM | Last Updated on Fri, Jan 31 2020 7:41 PM

Mahesh Babu Unveils Pradeep Machiraju Movie Video Song - Sakshi

యాంకర్‌ ప్రదీప్‌ మాచీరాజు హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ . ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్‌ సరసన అమ్రిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మ్యూజికల్‌ పోస్ట్‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఆవిష్కరించారు. ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం నుంచి మొదటి సాంగ్‌ లాంచ్‌ చేస్తున్నందకు ఆనందంగా ఉందని మహేష్‌ తెలిపారు. పాట చాలా బాగుందన్న మహేష్‌.. ప్రదీప్‌తోపాటు చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. 

తమ పాటను ఆవిష్కరించినందుకు చిత్రబృందం మహేష్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో సందడి చేస్తుంది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ సాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. సునీత, సిద్‌ శ్రీరామ్‌ పాడారు. కాగా, బుల్లితెరపై యాంకర్‌గా ప్రదీప్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement