ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్..టాప్‌లో ట్రెండింగ్‌! | Varun Sandesh Movie Viraji Top Trending In OTT Getting Huge Response, Deets Inside | Sakshi
Sakshi News home page

Viraji Movie OTT Response: ఓటీటీలో విరాజి మూవీ.. టాప్‌లో ట్రెండింగ్‌!

Published Fri, Aug 23 2024 9:31 PM | Last Updated on Sat, Aug 24 2024 1:22 PM

Varun Sandesh Movie Viraji Top Trending In Ott

వరుణ్ సందేశ్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కించిన హారర్‌ థ్రిల్లర్‌ విరాజి. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆద్యాంత్‌ హర్ష డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో  వరుణ్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 22 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో అంతగా మెప్పించలేని హారర్ థ్రిల్లర్‌.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే  56 లక్షల వాచ్ మినిట్స్‌తో  ఆహాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -' విరాజి సినిమా ఓటీటీలో 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ట్రెండ్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది.  ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు. ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. ఈ మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్‌తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో చూస్తూ ఎంజాయ్ చూస్తున్నారు" అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement