‘‘నేను ఫలానా తరహా పాత్రలే చేయాలని పరిమితులేవీ పెట్టుకోలేదు. కథ, అందులోని నా క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘మైఖేల్’ సినిమాలో విలన్‌గా చేశాను. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో వరుణ్ సందేశ్ పంచుకున్న విశేషాలు.
∙‘విరాజి’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్న కొంతమంది దగ్గరకు ఆండీ (వరుణ్ సందేశ్ పాత్ర పేరు) వచ్చాక అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు? అనేది సినిమాలో చూడాలి. ఓ సందేశం కూడా ఉంది. ఇలాంటి కథను సినిమాల పట్ల ΄్యాషన్ ఉన్న మహేంద్రగారిలాంటి వారే నిర్మించగలరు. మా సినిమాను మైత్రీవారు డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. ∙‘విరాజి’లోని నా పాత్ర లుక్, మేకోవర్‌ను కొత్తగా డిజైన్ చేశారు హర్ష.
రెండు డిఫరెంట్ కలర్స్‌లో హెయిర్ స్టైల్, ముక్కు పుడక, ఓ స్నేక్ టాటూ... ఇలా ఆండీ కొత్తగా కనిపిస్తాడు. ఈ మేకోవర్ నాకు కాస్త చాలెంజింగ్‌గా అనిపించింది. హెయిర్ కలరింగ్ కోసం ఏడు గంటలు, ట్యాటూస్ కోసం దాదాపు గంట పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ ట్యాటూ వేసుకోవాల్సి వచ్చేది. ‘విరాజి’ సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. ∙నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ‘హ్యాపీ డేస్’ సినిమా చేశాను.
17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఓ నటుడిగా నా ప్రయాణంలో విమర్శలు సహజమని నాకు తెలుసు. కానీ నా భార్య వితిక కాస్త ఫైర్ బ్రాండ్. అందుకే నా లుక్ గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్‌పై ఆమె అలా స్పందించారు. వితికలాంటి భార్య దొరకడం నా లక్‌గా భావిస్తున్నాను. ప్రస్తుతం ‘కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్నాను. ‘రాచరికం’ సినిమాలో పెద్ద మీసాలతో చిత్తూరు యాస మాట్లాడే వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment