ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే బరిలో పలు సినిమాలు ఉన్నా..ఆగస్ట్ 2న ‘విరాజి’ని విడుదల చేస్తున్నాం’అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
⇢ మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.
⇢ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ముందు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.
⇢ మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.
⇢ మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment