బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా! | Bigg Boss 3 Telugu: Housemates Involved In Movie Characters | Sakshi
Sakshi News home page

బాహుబలి స్టంట్స్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

Published Fri, Oct 18 2019 12:59 PM | Last Updated on Mon, Oct 21 2019 4:39 PM

Bigg Boss 3 Telugu: Housemates Involved In Movie Characters - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్‌ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్‌ ఇంట్లో టైటిల్‌ వేటకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపించి బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఎనభై ఏడు రోజులపాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఇంటి సభ్యులు వారిని చూడగానే ఎమోషనల్‌ అయ్యారు. వచ్చిన అతిథులు సైతం ఎవరి తరహాలో వారు టైటిల్‌ పోరుకు హౌజ్‌మేట్స్‌ను సన్నద్ధం చేసి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హౌజ్‌మేట్స్‌ అంతా ఒక్కొక్కరు ఒక్కో గెటప్‌లో దర్శనమిస్తున్నారు. శ్రీముఖి ధరించిన గెటప్‌ తనకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయినట్లు కనిపిస్తోంది.


కాగా తన హావభావాలు చూస్తుంటే ఇది మహానటి సావిత్రి పాత్ర అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక శివజ్యోతి చంద్రముఖి క్యారెక్టర్‌లో విరుచుకుపడి నటించినట్లు తెలుస్తోంది. వరుణ్‌, వితికలు బాహుబలి చిత్రంలోని ప్రభాస్‌, అనుష్క గెటప్‌ వేశారు. కత్తి తిప్పుతూ రాణిలా హావభావాలు పలికిస్తోంది వితిక. బాహుబలి ఫేమస్‌ సీన్‌ ఒకటి కాపీ చేయాలని చూడగా బొక్కబోర్లా పడ్డారు. వరుణ్‌ వీపు మీద నుంచి వితిక నడుచుకుంటూ వెళ్లాలని చూసింది. కానీ వరుణ్‌ బ్యాలెన్స్‌ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో అందరూ పడీపడీ నవ్వారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. వరుణ్‌.. మళ్లీ ఫ్రూట్‌ అయ్యాడంటున్నారు. మీరు కూడా కింది మీమ్స్‌ చూసి సరదాగా నవ్వుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement