ఒక్కరు కాదు ఇద్దరు! | Varun Sandesh's Lava Kusa audio launchd | Sakshi
Sakshi News home page

ఒక్కరు కాదు ఇద్దరు!

Published Tue, Apr 7 2015 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

ఒక్కరు కాదు ఇద్దరు!

ఒక్కరు కాదు ఇద్దరు!

వరుణ్ సందేశ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవ కుశ’. సంగారెడ్డిపేట ప్రకాశ్, వి.సత్యమోహన్‌రెడ్డి, ఎ.పండుబాబు ఈ చిత్రానికి నిర్మాతలు. జయ్ శ్రీ శివన్ దర్శకుడు. రామ్ నారాయణ్ స్వరాలు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన పాటల వేడుకలో ఆడియో సీడీని హీరో నాని ఆవిష్కరించారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో అన్ని అంశాలు బాగా కుదిరాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంద’’ని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగశౌర్య, రిచా పనయ్, ప్రభాస్ శ్రీను, కాసర్ల శ్యామ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement