మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విరాజి'. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న విరాజి సినిమా గురించి దర్శకుడు ఆద్యంత్ హర్ష పలు విషయాలు పంచుకున్నాడు.
ఫారిన్‌లో చదువుకున్న డైరెక్టర్ ఆద్యంత్ హర్ష సినిమాల పట్ల ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ నేర్చకున్నాడు. సుమారు పది కథలు రాసుకున్న ఆయన విరాజి చిత్రాన్ని ఫైనల్‌గా తెరకెక్కిస్తున్నారు. గతేడాది 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు చెప్పడంతో ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ మహేంద్రనాథ్‌కు నచ్చడం ఆపై వరుణ్ సందేశ్‌ను హీరోగా ఫైనల్ చేశామని ఆయన అన్నారు.
'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించిందని ఆద్యంత్ తెలిపారు.
'విరాజి' అనే టైటిల్‌కు అర్థం.. చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడని ఆయన అన్నారు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు అంటారని తెలిపారు. 'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారని ఆద్యంత్ తెలిపారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment