
బిగ్‌బాస్ హౌస్‌లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్‌మేట్స్ తెలపటం.. ఈ వీకెండ్‌లో హైలెట్‌గా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి మైండ్‌లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా, శత్రువుగా భావిస్తున్నారో.. వెన్నుపోటుదారునిగా అనుకుంటున్నారో తెలిసిపోనుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మహేష్, శ్రీముఖి, పునర్నవి, వరుణ్‌లకు సంబంధించి.. ఎవరెవర్ని ఏమని భావిస్తున్నారో.. చూపించినట్టు తెలుస్తోంది.
(బిగ్‌బాస్.. ఎలిమినేట్ అయింది ఆమేనా?)
బాబా భాస్కర్‌ను మిత్రుడుగా, అలీరెజాను శత్రువుగా.. శ్రీముఖిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌ను మిత్రుడుగా, బాబా భాస్కర్‌ను శత్రువుగా.. వితికా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా శ్రీముఖి పేర్కొంది. రాహుల్‌ను మిత్రుడుగా, వరుణ్ సందేశ్‌ను శత్రువుగా.. వితికాను వెన్నుపోటుదారులుగా పునర్నవి తెలిపింది. వితికాను తన శత్రువుగా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా వరుణ్ సందేశ్ పేర్కొనట్టు కనిపిస్తోంది. ఆసక్తికరంగా ఈ టాస్క్ హౌస్‌మేట్స్ మధ్య ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుందో చూడాలి. ఐదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేది అషూ రెడ్డి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి వీటన్నింటికి సమాధానం కావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment