బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌ | Bigg Boss 3 Telugu Sixth Week Secret Task To Save From Elimination | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

Published Tue, Aug 27 2019 11:20 PM | Last Updated on Tue, Aug 27 2019 11:27 PM

Bigg Boss 3 Telugu Sixth Week Secret Task To Save From Elimination - Sakshi

సీక్రెట్‌ టాస్క్‌లు అని బిగ్‌బాస్‌ అనుకోవడమే తప్పా.. లోపలి హౌస్‌మేట్స్‌, బయటి వీక్షకులకు మాత్రం వాటిని ఇట్టే పసిగట్టేస్తున్నారు. కష్టపడి ప్రోమోల రూపంలో ఆసక్తి రేపేందుకు ప్రయత్నిస్తున్నా.. నెటిజన్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేట్టుందనేలా ప్రోమోను కట్‌చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. అయితే అప్పటికే అది సీక్రెట్ టాస్క్‌ అయి ఉంటుందని మెజార్టీ ఆడియెన్స్‌ అభిప్రాయడపడగా.. చివరకు అదే నిజమైంది. 

ఆరోవారానికి గానూ నామినేషన్‌లోకి వచ్చిన పునర్నవి, హిమజ, మహేష్‌, రవి, రాహుల్‌, వరుణ్‌లకు ఓ డీల్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. వారిలోంచి ఓ ముగ్గురికి సేవ్‌ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. వారంతా కాంప్రమైజ్‌ అయ్యి రవి, రాహుల్‌, వరుణ్‌లు నామినేషన్‌లోంచి బయటపడేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ ముగ్గురికి కొన్ని సీక్రెట్‌ టాస్క్‌లను బిగ్‌బాస్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో బెడ్‌ను నీటితో తడపాలని, షేవింగ్‌ ఫోమ్‌ను మొహానికి రాయాలనే టాస్క్‌లను రవి ఎంచుకున్నాడు. దీంతో వితికా మొహానికి షేవింగ్‌ ఫోమ్‌ను, శివజ్యోతి బెడ్‌ను నీటితో తడిపాడు.

ఇక రాహుల్‌ వంతు వచ్చేసరికి.. హౌస్‌లోని ఓ సభ్యుడికి కోపం తెప్పించాలి, వరుణ్‌-వితికాల హార్ట్‌ షేప్‌ దిండును చింపేయాలనే వాటిని సెలెక్ట్‌ చేసుకున్నాడు. దీంతో హార్ట్‌ షేప్‌ దిండును ఈజీగానే చించేసినా.. ఓ సభ్యుడికి కోపం తెప్పించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరు రాహుల్‌ చేష్టలకు చిరాకు పడ్డారు. చివరకు శివజ్యోతిని ‘మూస్కొని పో’ అని ఓ మాట అనేసరికి.. రాహుల్‌పై ఫైర్‌ అయింది. వరుణ్‌ టైమ్‌ వచ్చేసరికి.. ఒకరి మీద కాఫీ పోయాలి, ఎవరి బట్టలైనా ముక్కలుముక్కలుగా చించేయాలనే టాస్కులను ఎంచుకున్నాడు. దీంతో సేఫ్‌ గేమ్‌ అన్నట్లు వితికా మొహంపై కాఫీ పోసేసి, ఆమె బట్టలనే చించేశాడు.  

దీంతో టాస్క్‌లు పూర్తి చేసినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అంతేకాకుండా ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ లభించిందని.. ఈ వారం పునర్నవి, హిమజ, మహేష్‌లు నామినేషన్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురికి షాక్‌ కొట్టినట్టైంది. ఆ ముగ్గురు సేవ్‌ అయినట్లు ప్రకటించిన వెంటనే శ్రీముఖి మొహం తెల్లబోయినట్లు కనిపించింది. ఈ వారంలో రాహుల్‌ బయటకు వెళ్లిపోతాడేమోనని అనుకున్న శ్రీముఖికి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తనకిచ్చిన టాస్క్‌లో గొడవపడ్డ వారందర్నీ క్షమించమని కాళ్లు మొక్కి మరీ అడిగాడు రాహుల్‌. దీంతో హిమజ, శివజ్యోతి మామూలు స్థితికి వచ్చేశారు. అయితే శ్రీముఖి మాత్రం మళ్లీ అదే రీతిలో స్పందించి.. రాహుల్‌ తరీఖా నచ్చలేదంటూ దూరం పెట్టే ప్రయత్నం చేసింది. తనకు ఇచ్చిన టాస్కే అలాంటింది.. ఒకరికి కోపం తెప్పించాలని అలా మాట్లాడనని చెప్పే ప్రయత్నం చేసి క్షమించమని అడిగినా.. అదే ధోరణిలో ప్రవర్తిస్తూ వచ్చింది. మొత్తానికి వరుణ్‌, రవి, రాహుల్‌.. నామినేషన్‌ నుంచి తప్పించుకోగా పునర్నవి, హిమజ, మహేష్‌లోంచి ఒకరు హౌస్‌ను వీడనున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది తెలియాలంటే వీకెండ్‌ వచ్చే వరకు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement