తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్ సీజన్ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన రాహుల్, రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్ గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్ డాన్సులు వేశారు.
షో నుంచి బయటకు వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు లెజెండ్స్ చేతులమీదుగా టైటిల్ తీసుకోవడం అదృష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్ చేంజ్ అవుతది అనిపిస్తుంది. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించినందుకు నా సంతోషానికి హద్దులు లేవు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్‌ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా సక్సెస్‌కు కారణమయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అభిమానులు రాహుల్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాహుల్ వారితో కాసేపు ముచ్చటించాడు. ఇక శ్రీముఖి టైటిల్ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక అభిమానులు తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment