బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌ | Bigg Boss 3 Telugu Cycling Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

Jul 30 2019 11:10 PM | Updated on Jul 30 2019 11:23 PM

Bigg Boss 3 Telugu Cycling Task - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్లకు, గ్యాస్‌, హౌస్‌ యాక్సరిస్‌కు కోతపెట్టేశాడు. అవసరానికి మించి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంటి సభ్యులకు చూపించాడు. మళ్లీ నీళ్లు రావాలన్నా.. గ్యాస్‌ కావాలన్నా సైకిల్‌ తొక్కుతూనే ఉండాలి. రాత్రి కూడా తొక్కుతూనే ఉండాలని.. లేకుంటే రాత్రంగా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయని తెలిపాడు. శివజ్యోతి టాస్క్‌లో అందరూ పార్టిసిపేట్‌ చేయాలని ఇంటి సభ్యులతో చెప్పడం, రవికృష్ణ ఏదో అన్నాడని తమన్నా అలగడం, జాఫర్‌, మహేష్‌, బాబా భాస్కర్‌, తమన్నాలు కలిసి శ్రీముఖి గురించి మాట్లాడుకోవడం హైలెట్‌గా నిలిచాయి.

సైక్లింగ్‌ టాస్క్‌ ఇంట్లో చిచ్చు పెట్టింది. గ్యాస్‌, నీళ్లు, హౌస్‌ యాక్సరీస్‌ కోసం సపరేట్‌గా మూడు సైకిళ్లు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్‌.. ఏ సైకిల్‌ తొక్కితే దానికి సంబంధించినవి నిరంతరాయంగా వస్తాయని తెలిపాడు. మూడు సైకిళ్లను విరామం లేకుండా తొక్కితూ ఉంటే మిగతా వాళ్లు వారి కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నారు. అక్కడ గ్యాస్‌కు సంబంధించిన సైకిల్‌ను పునర్నవి తొక్కినంత సేపు వంట గదిలో దోశలు వేస్తూ వితిక బిజీగా ఉంది.

అందరూ కలిసి లివింగ్‌ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. టాస్క్‌లో పార్టిసిపేట్‌ చేయోచ్చుగా అని వితికాను ఉద్దేశించి పునర్నవి అనడంతో పెద్ద రచ్చ జరిగింది. నేను కూడా టాస్క్‌లో ఉన్నానని 35,40 దోశలు వేశానని తెలిపింది. ఇలా మాటామాటా అనుకుంటూ.. తాను సైకిల్‌ తొక్కుతూ ఉంటేనే దోశలు వేశావని.. పునర్నవి అంది. నువ్వు తొక్కకపోతే వేరేవాళ్లు తొక్కేవారని వితికా అనగా.. దోశలు కూడా నువ్వు వేయకపోతే వేరేవాళ్లు వేసేవారని వరుణ్‌ కౌంటర్‌ ఇవ్వడంతో వితికా ఆగ్రహించింది.

తనకు గానీ, పునర్నవికి గానీ సపోర్ట్‌ ఇవ్వకు అని వరుణ్‌నుద్దేశింది వితిక పేర్కొంది. తనకు ఏది కరెక్ట్‌ అనిపిస్తే అది మాట్లాడతానని వరుణ్‌ తెలిపాడు. ఇదంతా జరుగుతుండగా.. పునర్నవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లి తనతో మాట్లాడూ అని వితికాను వరుణ్‌ కోరగా.. తానేమీ తప్పు చేయలేదని.. అలాంటప్పుడు తానెందుకు వెళ్లి మాట్లాడాలి అంటూ వరుణ్‌పై ఫైర్‌ అయింది. అలా ఆ గొడవ పెరుగుకుంటూ వితికా ఏడ్చే వరకు వెళ్లింది. అనంతరం ఇంటి సభ్యులు, వరుణ్‌ల ఓదార్పుతో కొంతసమయాన్ని గొడవ సద్దుమణిగింది. వరుణ్‌ తప్పు తనదేనంటూ క్షమాపణ చెప్పడంతో.. వితికా కూడా సారీ చెప్పింది.

రాత్రి పడుకోవడానికే ఇప్పుడు తొక్కుతున్నానని శ్రీముఖి అనడం కరెక్ట్‌ కాదని ఇంటి సభ్యులకు అర్థమయ్యేట్లు శివజ్యోతి చెప్పడం.. ఐదు టీమ్స్‌గా అందరం విడిపోదామని సలహా ఇవ్వడం.. అలా అయితే అందరికీ అవకాశం వస్తదని చెప్పుకొచ్చింది. కానీ హౌస్‌మేట్స్‌ ఈ ప్రతిపాదనను స్వీకరించలేదు. తనకు దోశ విషయంలో చిన్న టెస్ట్‌ పెట్టామని.. ఈ టెస్ట్‌లో తమన్నా ఫెయిల్‌ అయిందని రవికృష్ణ సరదాగా అన్నాడు. ఆ మాటలకు తమన్నా ఫీల్‌ అవ్వడంతో.. ఆమెను రోహిణి, శివజ్యోతిలు ఓదార్చారు. 

బాబా  భాస్కర్‌, జాఫర్‌, తమన్నా, మహేష్‌లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చర్చలో భాగంగా.. శ్రీముఖిని ఎవ్వరూ ఏం చేయలేరని తమన్నా చెబుతూ ఉంటే.. తను స్ట్రాటజీతో వచ్చిందని అనుకున్నాను కానీ అలాంటిదేం లేదు అంటూ జాఫర్‌ కూడా మాట కలిపాడు. మొదటి వారం తాను, శ్రీముఖి యాక్టివ్‌గా ఉన్నామని అయితే మా మాట వినడం లేదని ఈవారం వదిలేశామని మహేష్‌ కూడా వారితో కలిసి వంతపాడాడు.

అందరూ నిద్రిస్తున్న వేళ.. హౌస్‌ యాక్సరీస్‌కు సంబంధించిన సైకిల్‌ను శివజ్యోతి తొక్కడం కాస్త ఆలస్యమయ్యే సరికి ఇంట్లో గంట మోగుతూ లైట్లు వెలిగాయి. దీంతో కొంతమంది లేచి సైకిల్‌ తొక్కే ఏరియాకు వచ్చారు. ఇక రేపటి ఎపిసోడ్‌ మరింత రసవత్తరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఏదో టాస్క్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ టాస్క్‌లో శివజ్యోతి-వరుణ్‌ సందేశ్‌ల మధ్య గొడవ జరిగేట్టుంది. మరి ఆ సంగతి ఏంటో పూర్తిగా తెలియాలంటే బుధవారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement