
బిగ్‌బాస్ ఇంట్లో ఇప్పటివరకు చాలా కూల్‌గా కనిపించిన వ్యక్తి ఎవరంటే టక్కున వినిపించే పేరు వరుణ్. అలాంటి వరుణ్ వితికాపై విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. వితికాకు ఇంటిలో ఉండే అర్హతే లేదంటూ మొహం మీదే చెప్పాడు. వితికాను అందరి ముందే నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఏడిపించడానికి ప్రయత్నించినట్టుగానే ఉంది. వరుణ్ నిజంగానే అలా ప్రవర్తించాడా లేక ఇది బిగ్‌బాస్ ఆడిస్తున్న నాటకమా? అనేది భేతాళుని చిక్కు ప్రశ్నలా మారింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య మహేశ్.. వరుణ్‌తో కాస్త క్లోజ్ అయ్యాడు. దీన్నిబట్టి చూస్తే వరుణ్ -వితికా మధ్య పుల్లలు పెట్టింది మహేశే అని కొందరు తిట్టిపోస్తున్నారు. ఇది కెప్టెన్సీ టాస్క్ అని కొందరు తేలికగా తీసిపడేస్తున్నారు. మరోవైపేమో ఇది పక్కా సీక్రెట్ టాస్క్‌అని.. ఇందులో వరుణ్ గెలిచి రెండో కెప్టెన్‌గా ఎన్నికయి రికార్డు సృష్టించాలని వరుణ్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్ని గొడవలు జరిగినా వరుణ్ వితిక విడిపోవడమనేది జరగదని వారి ఫాలోవర్స్ గట్టిగా విశ్వసిస్తున్నారు. భూమి ఆకాశం ఒక్కటైనా వారిని విడదీయలేరు అంటూ ఆ జంటకు జై కొడుతున్నారు. కాగా ప్రోమోలో కనిపించే ట్విస్టులు ఎపిసోడ్‌లో ఉండవు.. ఎపిసోడ్‌లో ఉండే ట్విస్ట్‌లు ప్రోమోలు ఉండవు.. సో తప్పకుండా ఎపిసోడ్‌లో అంత సీన్ ఉండదు అని కొట్టిపారేస్తున్నారు ప్రోమో లవర్స్. మరో వైపేమో.. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు అవుతాయి. ఈ మాత్రం దీనికే ఇంత కంగారు పడిపోవాలా అంటూ పెళ్లయిన వారు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్‌బాస్ 3 సీజన్ కాస్త చప్పగా సాగుతోందని, చిన్నచిన్న గొడవలతో అలా నెట్టుకొస్తున్నారని, లవ్‌ట్రాక్‌లు కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా బిగ్‌బాస్ సీజన్ 1,2ల కన్నా ఇది బాగా వెనకపడిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో వీటన్నింటి నుంచి గట్టెక్కడానికి, టీఆర్‌పీ రేటింగ్‌ను అమాంతం పెంచడానికి బిగ్‌బాస్ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక వరుణ్ టాస్క్‌లో భాగంగా చేసినా.. నిజంగా అలా ప్రవర్తించినా తర్వాత వితిక దగ్గర అతని పరిస్థితిని తల్చుకుంటే జాలేస్తోందని నెటిజన్లు వరుణ్‌పై సానుభూతి ప్రకటిస్తున్నారు. వారు గొడవ పెట్టుకోలేదు. బిగ్‌బాస్ కావాలనే గొడవ పెట్టాడు అని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఏదిఏమైనా ఈ సారి వీర లెవల్లో విరుచుకుపడ్డ వరుణ్‌ను వితిక క్షమిస్తుందా? అసలు భార్యాభర్తల మధ్య నిప్పు రాజేసింది ఎవరు? ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్లనుంది..? అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment