'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల | Varun Sandesh Constable Motion Poster Out Now | Sakshi
Sakshi News home page

'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల

Published Thu, Aug 29 2024 8:42 PM | Last Updated on Thu, Aug 29 2024 8:42 PM

Varun Sandesh Constable Motion Poster Out Now

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్".  వరుణ్ సందేశ్‌కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్‌గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్  కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా  కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల  ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. 

నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో  దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement