నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు | Varun Sandesh fires On Mahesh Vitta In Bigg Boss House | Sakshi
Sakshi News home page

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు: వరుణ్‌ సందేశ్‌

Published Thu, Jul 25 2019 11:19 PM | Last Updated on Fri, Jul 26 2019 7:18 PM

Varun Sandesh fires On Mahesh Vitta In Bigg Boss House - Sakshi

వంట గదిలో వచ్చిన గొడవ ఇంకా చల్లారనే లేదు.. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంకో మూడు గొడవలు వచ్చి పడ్డాయి. హేమ-రాహుల్‌ గొడవతో పాటు మరో మూడు గొడవలు కొత్తగా వచ్చి పడ్డాయి. తన చపాతి ని ఎవరో తినేశారని పునర్నవి, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను సరిగా ఉపయోగించుకోలేదని మరో గొడవ, తన భార్యతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని మహేష్‌తో వరుణ్‌ సందేశ్‌ గొడవపడటం.. వీటితో ఎపిసోడ్‌ గడిచిపోయింది. మధ్యలో జాఫర్‌, హేమ, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు చేసిన స్కిట్‌ కాస్త ఫన్‌ క్రియేట్‌ చేసింది.  

నా చపాతిని ఎవరో తినేశారు..


ట్విటర్‌లో గురువారం ట్రెండ్‌ అయిన విషయం ఇదే. దీనిపై లెక్కలేనన్ని మీమ్స్‌ క్రియేట్‌ చేసి ఫన్‌ జనరెట్‌ చేశారు నెటిజన్స్‌. పదిహేను మందికి పదిహేను చపాతిలు చేయగా.. అందులో తనకు సంబంధించిన చపాతి సగం మాత్రమే ఉందని పునర్నవి గొడవ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం సిల్లీగా ఉన్నా.. ఎవరు తన చపాతిని తిన్నారని ఇంటిసభ్యులను అడిగింది. అలీ తిని ఉండొచ్చని చెప్పగా అతనిపై ఫైర్‌ అవ్వడం మొదలుపెట్టింది.

తన చపాతిని అలీ రెజా సగం తినేశాడని, అలా ఎలా తింటాడని తిడుతుండగా.. అలీ వచ్చి తాను రాహుల్‌కు సంబంధించిన చపాతిని సగం తిన్నానని, తాను తిన్నాక మిగిలినదే ఆ సగం అని వివరించాడు. బాబా బాస్కర్‌ రెండు చపాతీలు తిన్నాడని, అదే తన చపాతి అని తెలిపాడు. దీంతో అలీకి పునర్నవి సారీ చెప్పగా.. కూర బాగుండటంతో రెండు చపాతీలు తిన్నానని పునర్నవితో ఫన్‌ క్రియేట్‌ చేశాడు బాబా భాస్కర్‌.

లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌
ఇంటి సభ్యులందరూ కలిసి ఓ ఇద్దరి పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. జాఫర్‌, హేమలను హౌస్‌మేట్స్‌ ఎంచుకోగా .. వారిద్దరి స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఉన్న రెండు రూమ్స్‌లోకి ఇద్దరిని చెరొక రూమ్‌లోకి వెళ్లమని ఆదేశించాడు. ఆ రూమ్స్‌లో రెండు బటన్స్‌(రెడ్‌, గ్రీన్‌) ఉండగా.. బిగ్‌బాస్‌ అడిన వాటికి ఇద్దరు ఒకే బటన్‌(గ్రీన్‌) నొక్కితే లగ్జరీ బడ్జెట్‌లో పాలు, రెడ్‌ బటన్‌ నొక్కితే గుడ్లు లభ్యం కావని, ఇద్దరూ వేర్వేరుగా బటన్స్‌ నొక్కాల్సి ఉంటుందని తెలిపాడు.

అయితే ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినా.. గొడవలు మాత్రం తప్పలేదు. మొదటి సారి లగ్జరీ బడ్జెట్‌ ఇస్తే.. దాన్ని ఉపయోగించుకోవడంలో ఇంటి సభ్యులు పూర్తిగా విఫలమయ్యారు. తలా ఒకరికి 200 పాయింట్లు ఇవ్వగా.. కనీసం 1500పాయింట్లను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మహేష్‌, హేమలకు టీవీ ఆపరేట్‌చేయడం రాకపోవడం, ఏయే సరుకులు కావాలో త్వరగా తేల్చుకోలేకపోవడంతో లగ్జరీ బడ్జెట్‌ వృథాగాపోయింది. అయితే దీనికి కారణం శ్రీముఖేనని.. పిలిచినా రాలేదని హేమ అనడంతో శ్రీముఖి ఫైర్‌ అయింది. తాను సరైన సమయానికే వచ్చానని, కానీ టీవీని సరిగా ఆపరేట్‌ చేయలేదంటూ చెప్పుకొచ్చింది.

నా భార్యకు రెస్పక్ట్‌ ఇచ్చి మాట్లాడు : వరుణ్‌ సందేశ్‌
బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లే రూమ్‌ డోర్‌ వద్ద మహేష్‌ నిల్చున్నాడు. ఆ సమయంలో బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్తున్న తనతో అమర్యాదగా మాట్లాడని వితిక మొదలుపెట్టిన గొడవ పీక్స్‌కు వెళ్లింది. అంతకు ముందు కూడా ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడాడని వితికా తెలిపింది. అంతలో వరుణ్‌ సందేశ్‌ వచ్చి.. తన భార్యకు రెస్పక్ట్‌ ఇచ్చి మాట్లాడు అంటూ చేయి చూపిస్తూ మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఏంటి వేలు చూపిస్తున్నావంటూ మహేష్‌ సైతం వరుణ్‌ మీదకు వచ్చాడు. కొడతావా? అంటూ వరుణ్‌ సందేశ్‌ సైతం.. మహేష్‌ వైపు వెళ్లాడు. అక్కడే ఉన్న రాహుల్‌, మహేష్‌కు సర్ది చెప్తుండగా.. అతనిపైకీ మహేష్‌ అంతెత్తున లేచాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.. సిగ్గులేనోడా అంటూ వరుణ్‌ ఫైర్‌ అయ్యాడు. సో.. ఇలాగా ఎపిసోడ్‌ మొత్తం గొడవలతోనే నిండిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కూడా ఇదే విషయం కొనసాగేలా కనపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement