హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్‌ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లు వెంటాడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. తాజాగా సరికొత్త కథలో హీరోగా తిరిగి వస్తున్నాడు బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్ జంటగా ఆర్ . యన్ హర్ష వర్ధన్ దర్శకత్వంతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. శేషు మారం రెడ్డి ,బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం వస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి విజయం అందిస్తుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’అన్నారు.
‘ హర్షవర్ధన్ ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి.
‘సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , , మీనా కుమారి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నాడు దర్శకుడు హర్షవర్ధన్.
Comments
Please login to add a commentAdd a comment