
బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఈ వారంలో నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. ఎదుటి కంటెస్టెంట్ బిగ్‌బాస్ చెప్పిన టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిమజ కోసం వరుణ్ సందేశ్ చాలానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
హిమజ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే.. వరుణ్ సందేశ్ ఓ టాస్క్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బురదలో కూర్చొవాలనే టాస్క్‌ను వరుణ్ అతి కష్టం మీద చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వితికా భోరున ఏడ్చినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ అంతగా బాధపడటం చూసిన హిమజ.. తాను నేరుగా నామినేట్ అవుతానని బిగ్‌బాస్‌కు చెప్పుకొచ్చింది. ఇక మరి హిమజ నేరుగా నామినేట్ అయ్యిందా? మధ్యలోనే వరుణ్ టాస్క్‌ను వదిలేయాల్సి వచ్చిందా? అన్నది తెలియాలి.