
పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది
హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం వంటి సినిమాలతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో వరుణ్ సందేశ్ వివాహ తేదీ ఖరారయ్యింది. ఆగస్టు 18వ తేదీన తన ప్రియురాలు వితికా షేరును పెళ్లాడనున్నారు. 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించారు వితిక. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకునేసరికి నిజంగానే ఈ జంట ప్రేమలో పడిపోయింది.
పెద్దల అంగీకారంతో గత డిసెంబరులో నిశ్చితార్ధం చేసుకున్న వీరు.. మరికొద్ది రోజుల్లో దంపతులు కానున్నారు. ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 3.14 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) వీరి వివాహం జరుగనుంది. హైదరాబాద్ శివారులోని తూముకుంట విలేజ్ సమీపంలో ఉన్న అలంకృత రిసార్టు ఈ వేడుకకు వేదిక కానుంది.