
ఎలిమినేషన్ ప్రక్రియతో శ్రీముఖి, బాబా భాస్కర్‌ల మధ్య కాస్త దూరం పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇంటి సభ్యులందరూ శ్రీముఖితో అంటీఅంటనట్లుగా మెదులుతున్నారు. ఇక ప్రతి ఉదయాన్ని డాన్స్‌తో హుషారుగా ప్రారంభించే శ్రీముఖి తాజా ఎపిసోడ్‌లో డాన్స్‌కు దూరంగా ఉంది. ఇప్పటికే ఒంటరిగా ఫీలైన శ్రీముఖి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందనుకున్నప్పటికీ టాస్క్‌లో హుషారుగా పార్టిసిపేట్ చేసింది. పునర్నవి నామినేషన్ ప్రక్రియ గురించి వరుణ్‌తో మాట్లాడుతూ రవిపై వీరలెవల్లో సీరియస్ అయింది. వాడో పెద్ద వెధవ అంటూ నోటికొచ్చిన తిట్లు తిట్టింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు గుర్రుగా ఉండటంతో బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చివారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులని ప్రకటించారు.
ఇక టాస్క్ మొదటి రోజు అతి వినయం, అతి ప్రేమలతో సరదాగా సాగగా ముగ్గురు కోడళ్ల ముద్దుల అత్తగా శివజ్యోతి అలరించింది. అయితే ఎందుకైనా మంచిదని, అందరినీ ఓ కంట కనిపెట్టమంటూ అసిస్టెంట్ మహేశ్‌కు ఆర్డర్లు జారీ చేసింది . కాగా నేటి ఎపిసోడ్‌లో ఇంట్లో మళ్లీ గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని ప్రోమో లవర్స్ అంటున్నారు. మరి వీరి గొడవ టాస్క్ కోసమేనా లేక తర్వాత కూడా కొనసాగుతుందా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది!
Comments
Please login to add a commentAdd a comment