Bigg Boss 3 Telugu: Nagarjuna in in House | డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ! - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ!

Published Wed, Oct 9 2019 12:51 PM | Last Updated on Fri, Oct 11 2019 11:34 AM

Bigg Boss 3 Telugu Double Entertainment With King Nagarjuna - Sakshi

బిగ్‌బాస్‌ ఇల్లు రెట్టింపు సంతోషాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. దీనికి స్పెషల్‌ అట్రాక్షన్‌.. కింగ్‌ నాగార్జున అని చెప్పడంలో సందేహం లేదు. పంచెకట్టుతో సోగ్గాడి గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌.. ఇంటిసభ్యులను షాక్‌కు గురిచేశాడు. నాగార్జున రాకతో హౌస్‌మేట్స్‌ అరుపులు, కేకలతో బిగ్‌బాస్‌ హౌస్‌ దద్దరిల్లిపోయింది. ఇక ఇంటిసభ్యులందరూ వారి గొడవలను, అలకలను పక్కనపడేసి సోగ్గాడితో కలిసి దసరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక నాగార్జున రాకతో బిగ్‌బాస్‌ ఇంటికే కొత్త అందం వచ్చినట్టయింది. ఇంటిసభ్యులందరినీ తన మాటల గారడీతో ఆకట్టుకుంటూనే తనదైన పంచ్‌లు విసురుతున్నాడు.


కాగా స్వీట్లు, పండ్లు ఉన్న ట్రే పట్టుకున్న వరుణ్‌ను అది అరటిపండు కాదు.. ఫ్రూట్‌ అంటూ ఆటపట్టించాడు. ఇక ఇంటిసభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లే కాకుండా నాగ్‌ ఇచ్చిన ఫన్నీ గేమ్స్‌ను కూడా రఫ్ఫాడిస్తున్నట్టు కనిపిస్తోంది. చివరగా నాగ్‌కూడా వారితో కలిసి ఓ స్టెప్పేసినట్టు తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులకు స్వీట్లు తినిపించిన నాగ్‌ నేటి ఎపిసోడ్‌లో కానుకలు ఇవ్వడమే కాక వారితో ఆటలాడిస్తూ మరింత హుషారెత్తిస్తున్నాడు. అటు వారికి ఆనందం.. ఇటు చూసేవారికి వినోదం.. వెరసి నేటి ఎపిసోడ్‌ డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement