Bigg Boss 3 Telugu EP 81 Highlights: Nagarjuna is the Special Guest for Dussehra Celebrations in House and Announced Star of the Week | స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే! - Sakshi
Sakshi News home page

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!

Published Thu, Oct 10 2019 11:17 AM | Last Updated on Sat, Oct 12 2019 2:58 PM

Bigg Boss 3 Telugu Varun And Siva Jyothi Star Of The House - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లోకి మన్మథుడు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే! ఇక నాగ్‌ ఇంటిసభ్యులందరితో సరదాగా ఆటలు ఆడించాడు. ఇందులో భాగంగా అలీరెజా గంతలు కట్టుకుని మహేశ్‌ను సుందరాంగుడిగా ముస్తాబు చేశాడు. వరుణ్‌ కళ్లు మూసుకోగా, కళ్లకు గంతలు కట్టుకున్న శ్రీముఖి అతనికి వెనకనుంచి కేక్‌, అరటిపండు, బ్రెడ్‌ తినిపించి నీళ్లు తాగిపించింది. ఇక బాబా భాస్కర్‌ పిండిగిన్నెలో కేవలం నోటి సహాయంతో 5 కాయిన్స్‌ తీశాడు. శివజ్యోతి అయిదు రకాల పచ్చి కూరగాయలను తింది.

రాహుల్‌ ఓ పాటను కిలికి భాషలో మార్చి పాడాడు. మహేశ్‌కు బెల్లీ డాన్స్‌ వేయాలని చిట్టీ రాగా మేం చూడలేం బాబోయ్‌ అంటూ శ్రీముఖికి పాస్‌ చేశారు. ఇక శ్రీముఖి బెల్లీ డాన్స్‌తో అదరగొట్టింది. మహేశ్‌ శివజ్యోతికి కేక్‌ రుద్దాడు. వితిక బెలూన్‌లోని హీలియంను పీల్చి నోటిలో పెట్టుకుని సుర్రు సుమ్మైపోద్ది అని డైలాగ్‌ చెప్పింది. రాహుల్‌ కూడా హీలియం పీల్చుకుని ఏమైపోయావే పాట పాడాడు. దీంతో ఇంటిసభ్యులు పడీపడీ నవ్వారు. శివజ్యోతి, బాబా భాస్కర్‌, శ్రీముఖి, మహేశ్‌, వరుణ్‌లు కూడా హీలియం పీల్చుకుని పాట పాడారు.

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు స్టార్‌ ఆఫ్‌ ద హౌస్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందుకోసం ఇంటిసభ్యులందరూ ఒక్కొక్కరిగా వారికి ఆల్‌రౌండర్‌ అనిపించిన వ్యక్తికి స్టార్‌ ఇస్తూ అందుకు కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అలీ రెజా, మహేశ్‌- శివజ్యోతి, శివజ్యోతి- అలీ రెజా, బాబా భాస్కర్‌- శ్రీముఖి, శ్రీముఖి- బాబా భాస్కర్‌, రాహుల్‌, వితిక- వరుణ్‌, వరుణ్‌- వితికలకు స్టార్‌లు ఇచ్చారు. రెండు స్టార్లు దక్కించుకున్న శివజ్యోతి, వరుణ్‌లు ఇద్దరూ స్టార్‌ ఆఫ్‌ ద హౌస్‌గా నిలిచారు. వీరికి ఈ వారం అంతా స్పెషల్‌ డిన్నర్‌ ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. ఇక ఇంటిసభ్యులు వారి జీవితంలో సాధించిన విజయాలను నాగ్‌తో పంచుకున్నారు. ‘కుదిరితే సినిమాలు చూసేవాన్ని. కరెంటు పోతే కథలు రాసేవాన్ని’ అని చెప్పిన మహేశ్‌కు నాగ్‌ ఆఫర్‌ ఇచ్చాడు. బయటికి వచ్చాక మంచి స్టోరీ పంపించు అని చెప్పాడు.

జీవితంలో సాధించిన విజయాలు
టీవీలో కనిపించాలన్న తల్లి కోరిక తన ద్వారా నెరవేరిందని.. తనకు రాములమ్మగానే మంచి గుర్తింపు వచ్చింది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చింది శ్రీముఖి. డాన్స్‌ కంపోజ్‌ చేసిన మొదటి పాటకే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు రావటం.. అది తన తండ్రి తీసుకోవడం గర్వంగా అనిపించిందని భాబా భాస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఇంటిని కాదనుకుని వచ్చి నా భర్తతో కలిసి సొంత కాళ్లపై బతకడం తన విజయమని శివజ్యోతి తెలిపింది. ‘నా భార్యే నా సక్సెస్‌’ అని అలీ రెజా అన్నాడు. జనాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటమే సక్సెస్‌ అని రాహుల్‌, మహేశ్‌లు అన్నారు. ఇక మీకందరికీ బిగ్‌బాస్‌ షో పెద్ద విజయంమని నాగార్జున చెప్పాడు. ఇక్కడి వరకు రావడం విజయంగా ఫీల్‌ అవుతున్నా వితిక, వరుణ్‌లు పేర్కొన్నారు. ఇక ఇంటిసభ్యులందరికీ నాగ్‌ నూతన వస్త్రాలను గిఫ్ట్‌ ఇచ్చాడు. చివరగా అందరితో కలిసి ఓ స్టెప్పేసి వారి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు.

గుర్తుకొస్తున్నాయి..


ఇక రాహుల్‌ పునర్నవిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాడు. పున్ను ఇంట్లో ఉండటం కన్నా వెళ్లడం మంచిదైందని వితిక అభిప్రాయపడింది. మహేశ్‌.. శివజ్యోతికి స్టార్‌ పెట్టడంతో బాబా ఫ్రస్టేట్‌ అవుతున్నాడని శివజ్యోతి అభిప్రాయపడింది. బిగ్‌బాస్‌ ఇంట్లో దసరా సంబరాలు పూర్తయ్యాయి. మరి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఎలాంటి కఠినతర టాస్క్‌లు ఇవ్వనున్నారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement