
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇందువదన". ఎమ్‌ఎస్‌ఆర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాధవి ఆదుర్తి నిర్మించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరిపిన క్లైమాక్స్ షూటింగ్‌తో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది.
తాజాగా ఈ చిత్రంలో వాసు పాత్ర పోషించిన వరుణ్ సందేశ్, ఇందు పాత్ర చేసిన ఫర్నాజ్ పాత్రల లుక్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ అటవీశాఖ అధికారి పాత్ర చేశారు. సతీష్ ఆకేటి కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: శివకాకని, సహనిర్మాత: గిరిధర్.