సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో, బిగ్‌బాస్ 3 ఫేం వరణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాత, జ్ఞానపీఠ్ ఆవార్డు గ్రహిత జీడిగుంట రామచంద్ర మూర్తి(80) మంగళవారం కన్నుముశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కథ, నవల, నాటకం, వ్యాస, ప్రసారమధ్యమ రచన తదితర ప్రక్రియల్లో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన రేడియో కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు)
1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో వరంగల్ సహకార బ్యాంక్‌లో ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం విద్యాశాఖలో పని చేసిన అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తిస్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో 1960లో ఆయన తొలిసారిగా రచించిన ‘హంసగమన’ అనే కథ ప్రచరితమయ్యింది. ఆ తర్వాత ఆయన 300 కథలు, 40 నాటికలు, 8 నవలలు రేడియో టెలివిజన్ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment