
జేబు దొంగ ప్రేమ
అతనో 420. పెద్ద దొంగతనాలు చేయడు. చిన్న జేబు దొంగ. ఫ్రెండ్స్‌తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు.
‘అతనో 420. పెద్ద దొంగతనాలు చేయడు. చిన్న జేబు దొంగ. ఫ్రెండ్స్‌తో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. ఆ టైమ్‌లో అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు?’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ 420’. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ జంటగా ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరి కుమార్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ‘‘ఇందులో చిల్లర దొంగగా కనిపిస్తా. ప్రేమలో పడ్డాక నా లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అనేది సినిమా. ప్రస్తుతం రామ్మూర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, రాఘవేంద్రరావు గారి శిష్యుడు సత్య నారాయణగారి డెరైక్షన్‌లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు.