థ్రిల్లింగ్‌ కానిస్టేబుల్‌ | Varun Sandesh about the constable movie | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ కానిస్టేబుల్‌

Published Fri, Jun 21 2024 3:58 AM | Last Updated on Fri, Jun 21 2024 3:58 AM

Varun Sandesh about the constable movie

వరుణ్‌ సందేశ్‌ హీరోగా రూపొందుతున్న ‘ది కానిస్టేబుల్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘బలగం’ జగదీష్‌ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ– ‘‘కానిస్టేబుల్‌ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఈ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. వరుణ్‌ సందేశ్‌ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే. ‘‘కానిస్టేబుల్‌ పాత్రలో వరుణ్‌ సందేశ్‌ ఆకట్టుకుంటారు. పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు ‘బలగం’ జగదీష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement