బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా! | Bigg Boss 3 Telugu Is This Real Or Fake Fight Between Varun And Rahul | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

Published Thu, Sep 26 2019 10:56 AM | Last Updated on Fri, Sep 27 2019 1:06 PM

Bigg Boss 3 Telugu Is This Real Or Fake Fight Between Varun And Rahul - Sakshi

బిగ్‌బాస్‌ ఇచ్చిన ఏ టాస్క్‌ అయినా గొడవ జరగకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. ప్రస్తుతం ఇచ్చిన ఫన్నీటాస్క్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. అత్తగా నటిస్తున్న శివజ్యోతికి ముగ్గురు కొడుకులు కోడళ్లు వరుణ్‌-వితిక, రవి-శ్రీముఖి, రాహుల్‌-పునర్నవిలను జంటలుగా విడగొట్టారు. వీరిలో ఏ జంట ఎక్కువ ఇటుకలతో గోడ నిర్మిస్తే వారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులన్న విషయం తెలిసిందే. వీరితో పాటు వీలునామా చేజిక్కించుకున్న వారు కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతారు. అయితే ఇటుకలను సంపాదించడానికి వితిక, శ్రీముఖి.. శివజ్యోతిని బాగానే కాకా పట్టారు. వితిక అత్తను అందంగా ముస్తాబు చేయడం, శ్రీముఖి శివజ్యోతికి గోరుముద్దలు తినిపించడం.. ఇలా అడగకముందే కోడళ్లు అన్ని సపర్యలు చేస్తూ అత్తను బుట్టలో వేసుకోడానికి ప్రయత్నించారు. ఇక ఇప్పటివరకు జరిగిన పర్‌ఫార్మెన్స్‌ ఆధారంగా వితిక జంటకు 22 ఇటుకలు లభించగా మిగిలిన రెండు జంటలకు 20 మాత్రమే లభించాయి.

టాస్క్‌లో భాగంగా రాహుల్‌.. వరుణ్‌ దగ్గర ఇటుకలు కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఎన్ని ఇటుకలు సంపాదించుకున్నాం అనేదానికన్నా ఎన్ని లాక్కున్నాం అనేదానిపైనే రాహుల్‌ ప్రధానంగా దృష్టి సారించాడు. దీంతో ఇటుకలు పట్టుకొస్తున్న వరుణ్‌ను కట్టడి చేసి అతని దగ్గర నుంచి ఇటుకలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాహుల్‌, వరుణ్‌, వీరిద్దరినీ ఆపేందుకు ప్రయత్నించిన వితికకు గాయాలయ్యాయి. దీంతో వారిమధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కూల్‌గా ఉండే వరుణ్‌ సహనాన్ని కోల్పోయాడు. ఏంటి? కొడతావా అంటూ రాహుల్‌పై సీరియస్‌ అయ్యాడు. గతంలో జరిగిన వాటిని తవ్వి తీస్తూ.. ‘అలీ చేసిన తప్పే నువ్వూ చేస్తున్నావని, హిమజ విషయంలోనూ ఏం జరిగిందో అందరూ చూశారు’ అని రాహుల్‌ను తప్పుబట్టాడు. తాను ఏ తప్పూ చేయలేదంటూ రాహుల్‌ కూడా గొడవకు దిగాడు.

అందరూ ప్రశాంతంగా ఆడండని శివజ్యోతి చెప్పిన మాటలను పెడచెవిన పెడుతూ ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వారు. ఒకవైపు హోరాహోరీగా వీరికి గొడవ జరుగుతుంటే మరోవైపు రవి-శ్రీముఖిలు మాత్రం ఇటుకలు జారవేస్తూ వారి పని పూర్తి చేశారు. ఇక అగ్నికి ఆజ్యం పోయడానికా అన్నట్టు శ్రీముఖి.. వరుణ్‌ దగ్గరకు వెళ్లి రాహుల్‌ గురించి నెగెటివ్‌గా చెప్పింది. అప్పటివరకు సరదాగా సాగిన టాస్క్‌.. వీరి గొడవలతో హీటెక్కింది. కాగా ‘రాహుల్‌- వరుణ్‌ల ఫ్రెండ్‌షిప్‌ ఇంతేనా..?’ అని పునర్నవి షాక్‌కు గురయింది. అయితే ఇదంతా ఉత్తుత్తే అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి నిజంగానే వారిద్దరూ గొడవపడ్డారా? లేక ఇది బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్కా? అన్న ప్రశ్న ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తోంది. దీనికి సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement