బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలె ఆసక్తికరంగా సాగుతోంది. హీరోయిన్ల ఆటపాటలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రస్తుతం ఫినాలె ఎపిసోడ్ సాగుతోంది. ప్రముఖ హీరోయిన్లు క్యాథరిన్, అంజలి తన నృత్యాలతో బిగ్ బాస్ స్టేజ్‌ను వేడెక్కించారు. అనంతరం గెస్ట్‌గా దర్శనమిచ్చిన హీరో శ్రీకాంత్.. హౌజ్‌లోకి వస్తూనే టెన్షన్ రేపారు. హౌజ్‌లోని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ. 10 లక్షల సూట్‌కేస్ తీసుకొని.. ఒక కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌కు కంటెస్టెంట్లు ఎవరూ ముందుకురాలేదు. కంటెస్టంట్ల కుటుంబసభ్యులను ఈ ఆఫర్ గురించి నాగార్జున అడుగగా.. వాళ్లు కూడా ఈ ఆఫర్‌కు ఒప్పుకోవద్దంటూ కంటెస్టెంట్లకు సూచించారు.
దీంతో శ్రీకాంత్ ప్లాన్-బీ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మరో పది లక్షల సూట్‌కేసును హౌజ్‌లోకి తీసుకొచ్చారు. మొత్తం రూ. 20లక్షలున్న రెండు సూట్‌కేసులు తీసుకొని.. హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చునని శ్రీకాంత్ కంటెస్టెంట్లకు సూచించారు. నలుగురు అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారని, మిగతా ముగ్గురు ఓడిపోవాల్సిందేనని చెప్పిచూశారు. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నవాళ్లు, విజేత కాలేనేమోనని భావించే ఎవరైనా ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టాలని, రూ. 20 లక్షలంటే మామూలు విషయం కాదని, అదృష్టం కలిసివస్తే కాలదన్న కూడదని కంటెస్టెంట్లకు శ్రీకాంత్ హితబోధ చేసినా.. ఎవ్వరూ కూడా ఈ ఆఫర్‌ను ఒప్పుకోలేదు. దీంతో ప్లాన్ సీ రూపంలో క్యాథరిన్ థెరిస్సా హౌజ్‌లోకి ఎంటరై.. ఎవరూ ఎలిమినేట్ అవుతున్నారో తెలిపే సీల్డ్ కవర్‌ను తీసుకొచ్చింది. చివరినిమిషంలోనూ సీల్డ్ కవర్‌లో తెరిచేటప్పుడు కూడా నాగార్జున్ సూట్‌కేసులను తీసుకొని వెళ్లిపోవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. బాబా భాస్కర్ కొంచెం తక్కువ కాన్ఫిడెన్స్‌తో కనిపించినా ఈ ఆఫర్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎవరూ అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ సీల్డ్ కవర్‌ను తెరిచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరును ప్రకటించాడు. వరుణ్‌ను ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతన్ని తీసుకొని.. శ్రీకాంత్, క్యాథరిన్ తీసుకొని నాగార్జున వద్దకు వచ్చారు.
20 లక్షల ఆఫర్.. హౌజ్‌లో టెన్షన్ రేపిన శ్రీకాంత్
Published Sun, Nov 3 2019 8:23 PM | Last Updated on Mon, Nov 4 2019 7:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment