
సింబా సినిమా హిట్‌తో పుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్‌యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ సారి ‘గల్లీ బాయ్’గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్, ఆలియా తమదైన స్టైల్‌లో అదరగొట్టారు. (నీ ఆశీర్వాదం వల్లే సినిమా హిట్టయ్యింది’)
ఇందులో రణ్‌వీర్ మంచి సింగర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతను గల్లీలో తిరిగే సామాన్య వ్యక్తి కావడంతో అందరూ తక్కువగా చూస్తుంటారు. అతన్ని హేళన చేస్తూ మాట్లాడుతారు. చదువుకొమ్మని కాలేజ్‌కి పంపిస్తే పాటలు అంటూ రోడ్లపై తిరుగుతున్నాడని రణ్‌వీర్ తండ్రి కూడా కోప్పడతాడు. చివరకూ ఆ యువకుడు ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించనున్నారు. ‘మనకూ టైం వస్తుంది’(అప్నా టైమ్ ఆయేగా) అనే క్యాప్షన్‌ను చూస్తేనే మూవీ ఉద్దేశమేంటో అర్థమవుతుంది. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment